సెనగ కట్టు
కావలిసిన పదార్థాలు
1. సెనగ పప్పు 1 కప్పు
2. నీళ్లు 3 కప్పులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. పసుపు కొద్దిగా
5. ఆయిల్ 1 స్పూన్
6. మినపప్పు అర స్పూన్
7. ఆవాలు కొద్దిగా
8. జీలకర్ర కొద్దిగా
9. ఎండుమిరపకాయలు 2.
10. ఇంగువ కొద్దిగా
11. వెల్లుల్లి రెబ్బలు 2
తయారీ విధానం
ముందుగా సెనగపప్పును శుభ్రం గా కడిగి
3 కప్పులు నీళ్లు పోసుకుని కుక్కరులో పెట్టి ఉడికించుకుని
చల్లారాక ఒక బౌల్ పైన చిల్లుల పళ్లెం పెట్టి ,
అందులో పోస్తే పప్పు పప్పు తేట వేరవుతాయి .
ఈ పప్పు తేట లో తగినంత ఉప్పును వేసి ,
బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులు ,వెల్లుల్లిరెబ్బలు ,
వేసి దోరగా వేగాక, ఈ పోపు మిశ్రమాన్ని
పప్పు తేట మీద వేసి బాగా కలిపితే ,
సెనగ కట్టు రెడీ అవుతుంది.
** కొబ్బరికోరు సెనగపప్పు కూరకి సెనగపప్పును ఉడికించుకున్నప్పుడు
పప్పును వాడకట్టగా వచ్చిన నీటితో దీనిని చేసుకోవచ్చు .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.