కావలిసిన పదార్థాలు
1. బంగాళాదుంపలు 3
2. గ్రీన్ పీస్ అర కప్పు
3. బ్రెడ్ స్లైసెస్ 8
4. గరం మసాలాపొడి అర స్పూన్
5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
6. జీడిపపప్పు పొడి 1 స్పూన్
7. కారం 1 స్పూన్
8. ఉప్పు రుచికి సరిపడా
9. కొత్తిమీర తురుము 1 స్పూన్
10. జీలకర్ర పొడి 1 స్పూన్
11. ధనియాల పొడి 1 స్పూన్
12. ఆయిల్ 4 స్పూన్స్
13. నెయ్యి
తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను , గ్రీన్ పీస్ ను శుభ్రం గా కడిగి ,
కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి . చల్లారిన బంగాళదుంపలను ,
పైన వున్న తొక్కను తీసి ఒక పక్కన పెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి , దోరగా వేగాక ,
బంగాళదుంపలను ,గ్రీన్ పీస్ ను ,పసుపు ,
,ఉప్పు ,కారం ,జీలకర్రపొడి ,ధనియాలపొడి ,
జీడిపప్పుపొడి ని , వేసి ,బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి .
ఒక బౌల్ లోకి కూరను తీసుకుని ,పైన కొత్తిమీరను చల్లుకోవాలి ,
కూరను గట్టిగా లేకుండా చూసుకోవాలి .
స్టవ్ పైన పెనం పెట్టి వేడెక్కాక , నెయ్యి వేసి ,బ్రెడ్ స్లైసెస్ ను వేసి ,
దోరగా కాల్చుకోవాలి .
కాల్చుకున్న రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్య
మనం తయారుచేసి పెట్టుకున్న కూరను పెట్టి సర్వ్ చేసుకోవాలి.
బంగాళాదుంప బ్రేడ్ టోస్ట్ రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi