ఆరోగ్యానికి " చారు "
1. జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ రసం అన్నం తింటే మంచిది.
2. రసంలోని టమోటాలు, చింతపండు, మిరియాలు, కరివేపాకులో పోషకాలు
రసం తీసుకోవడం ద్వారా శరీరానికి అందుతాయి.
3. టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్ సి ఉంటాయి.
ఇవి రోగనిరోధశక్తిని పెంచడంలోకీలకపాత్ర పోషిస్తాయి.
4. ఇన్‌ఫెక్షన్లను అదుపులో ఉంటాయి.
5. జబులు, దగ్గు వంటివి దరిచేరవు.
6. బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం.
7. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.
కావలిసిన పదార్థాలు
1. టమేటాలు 2
2. పచ్చిమిర్చి 2
3. చింత పండు కొద్దిగా
4. బెల్లం తగినంత
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. కొత్తిమీర కొద్దిగా
8. కరివేపాకు కొద్దిగా
9. నీళ్లు 4 గ్లాసులు
పోపు దినుసులు
ఆవాలు కొద్దిగా ,మెంతులు కొద్దిగా ,జీలకర్ర కొద్దిగా, ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయ 1 , ఆయిల్ 1 స్పూన్
రసం పొడికి
ఎండుమిరపకాయలు 3, మిరియాలు 1 స్పూన్ , ఆవాలు కొద్దిగా ,
మెంతులు కొద్దిగా , జీలకర్ర 1 స్పూన్ , ధనియాలు 6. స్పూన్స్,
కందిపప్పు 5 స్పూన్స్ .
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ,
అందులో చింత పండు ,బెల్లం ,ఉప్పు ,పసుపు ,తరిగిన టమేటా ,
పచ్చిమిర్చి ముక్కలు ,వేసి స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి .
స్టవ్ మీద బాణలి పెట్టి
రసం పొడికి
పైన చెప్పుకున్న దినుసులను , ఆయిల్ లేకుండా పొడిగా దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
ఒక సీసా లో పోసుకుంటే రసం పొడి రెడీ అవుతుంది .
ఈపొడిని ఒక స్పూన్ మరుగుతున్న రసం లోవేసి బాగాకలిపి ,
కొద్దిసేపు మరగనివ్వాలి.
స్టవ్ పైన బాణలి పెట్టి ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి , వేగాక కరివేపాకును వేసి, వేగిన తరువాత
మరుగుతున్న రసం లో వేసి ఒక 5 నిమిషాల తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీరను చల్లి మూత పెట్టుకుంటే
ఘుమ ఘుమ లాడే టమేటా రసం రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi