పూరీ సెనగ పిండికూర
కావలిసిన పదార్థాలు
1. ఉల్లిపాయలు 5
2. బంగాళాదుంపలు 2
3. కేరట్లు 2
4. పసుపు కొద్దిగా
5. సెనగపిండి 3 స్పూన్స్
6. పచ్చిమిర్చి 3
7. అల్లం చిన్న ముక్క
8. కరివేపాకు9. పంచదార 1 స్పూన్
10. నీళ్లు కూరకి సరిపడా
11. ఉప్పు రుచికి సరిపడా
12. కొత్తిమీర
పోపుదినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఎండుమిరపకాయ 1, ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ఉల్లిపాయలను చీలికలుగాను ,అల్లమును చిన్న ముక్కలుగా ,
పచ్చిమిర్చిని చీలికలుగాను , బంగాళాదుంప, కేరట్ లను ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
సెనగ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని , అందులో ఒక స్పూన్ పంచదారను ,
ఒక గ్లాసు నీళ్లను పోసి ,ఉండలు లేకుండా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి, పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక ,
తరిగి పెట్టుకున్న కూర ముక్కలను, కరివేపాకును, పసుపు ,
ఉప్పు ను వేసి బాగా కలిపి , తగినన్ని నీళ్లు పోసి ,ఉడకనిచ్చి ,
దీంట్లో ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న ,
సెనగ పిండిని వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి .
మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి లేకపోతే
అడుగంటుతుంది .
కూర బాగా దగ్గర పడ్డాక ,ఒక బౌల్ లోకి తీసుకుని ,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే పూరీ సెనగ పిండి కూర
రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi