Sunday, 4 December 2016

గుమ్మడికాయ పులుసు


గుమ్మడికాయ  పులుసు

కావలిసిన పదార్థాలు

1. గుమ్మడి కాయ  ఒక ముక్క
2.  ములక్కాడ లు  2.
3. బెండకాయలు  2.
4. వంకాయలు  2.
5. టొమాటో  1
6. పచ్చిమిర్చి  3
7. చింతపండు  నిమ్మకాయ  అంత
8. బెల్లం  తగినంత
9. పసుపు  కొద్దిగా
10. ఉప్పు రుచికి సరిపడా
11. వరిపిండి  2 స్పూన్స్
12. కరివేపాకు  కొద్దిగా 

పోపు  దినుసులు
ఆవాలు  కొద్దిగా  , మెంతులు  కొద్దిగా   , జీలకర్ర  కొద్దిగా,   ఇంగువ  కొద్దిగా  ,
ఎండుమిరపకాయలు  2  ,ఆయిల్  2 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  గుమ్మడి  కాయముక్క  ,ములక్కాడ  ,టమాటో  ,
బెండకాయ , వంకాయ , పచ్చిమిర్చి లను  , శుభ్రం  గా  కడిగి  ,
ముక్కలుగా  తరుగుకోవాలి  .
చింతపండును  2  గ్లాసుల  నీళ్లు  పోసి  నానబెట్టాలి  .
వరిపిండిని ఒక బౌల్ లో కొద్దిగా  నీళ్లు  పోసి కలుపుకోవాలి  .
ఒక  గిన్నెలో  ముక్కలు వేసి  ,చింతపండును  తుక్కులు లేకుండా బాగా పిసికి ,
పలుచని  రసం లా తీసి  , ముక్కల   పైన వేసి  ,
పసుపు  ,ఉప్పు , బెల్లం  వేసి ,
స్టవ్  వెలిగించి  గిన్నెను  స్టవ్   మీద పెట్టి ఉడకనివ్వాలి  .
ముక్కలు  ఉడికేక  ముందుగా నీళ్లలో  కలిపి  ఉంచుకున్న  ,
వరిపిండిని  వేసి కలిపి  కొద్దిసేపు  మరగనివ్వాలి  .
స్టవ్  వెలిగించి   బాణలి  పెట్టి వేడెక్కా క  ఆయిల్  వేసి
పైన  చెప్పిన  పోపు  దినుసులను  ,కరివేపాకును  ,
వేసి  దోరగా  వేగనిచ్చి ,
 మరుగుతున్న  పులుసులో  వేసి  కొద్దిసేపు మరగనిచ్చి
 స్టవ్  ఆఫ్  చేసుకుని  పైన  కొత్తిమీర  చల్లి
 మూత  పెట్టుకుంటే  , ఘుమ ఘుమ  లాడే
 గుమ్మడికాయ  పులుసు  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.