వంకాయ టమాటా ఉల్లిపాయ కూర
కావలిసిన పదార్థాలు
1. వంకాయలు పావుకేజీ
2. టమాటాలు 2.
3. ఉల్లిపాయలు 3.
4. ఆయిల్ 6 స్పూన్స్
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. కారం రుచికి సరిపడా
8. కొత్తిమీర
9. నీళ్లు కొద్దిగా
10. కరివేపాకు
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్
తయారీ విధానం
ముందుగా టొమాటాలు ,ఉల్లిపాయలు , వంకాయలను శుభ్రం గా కడుగుకోవాలి .
టొమాటోలను ,ఉల్లిపాయలను , సన్నగా చిన్నముక్కలుగా ను ,
వంకాయలను గుత్తి గా ఉంచి చీలికలు చేయాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసిఅవి దోరగా వేగాక ,
కరివేపాకు ,టమాటో ,ఉల్లిపాయముక్కలు , పసుపు ,ఉప్పు ,కారము ,
వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి .
కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి .
స్టవ్ పైన వేరే బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న వంకాయ గుట్టలను ,వేసి దోరగా వేపుకోవాలి .
ఇలా దోరగా వేపుకున్న వంకాయ గుత్తు లను,
టమాటో ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి
పైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
వంకాయ టమాటో ఉల్లిపాయ కూర రెడీ అవుతుంది
ఈ కూరను వేడి అన్నం లోను చపాతీలలోను బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi