కావలిసిన పదార్థాలు
1. వాము ఆకులు
2. సెనగపిండి ఒక గ్లాసు
3. వరిపిండి పావు గ్లాసు
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5. కారం ఒక స్పూన్
6. ఉప్పు రుచికి సరిపడా
7. వాము కొద్దిగా
8. ఆయిల్ బజ్జీలు వేగడానికి సరిపడినంత
9. నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా వాము ఆకులు శుభ్రంగా కడిగి,
ఒక ప్లేట్ లో ఆరబెట్టాలి
ఒక బౌల్ లోకి సెనగపిండి ,వరిపిండి ,
వాము ,ఉప్పు ,కారం ,బేకింగ్ పౌడర్ వేసి
బాగా కలిపి , తరువాత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ,
ఈపిండి గరిట జారులా ఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకుని ఆరిన వాము ఆకులను ఒక్కొక్కటి గా
సెనగ పిండి లో ముంచి ఆయిల్ లో వేసుకుని
దోరగా వేపుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వాముఆకు బజ్జీ రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi