కావలిసిన పదార్థాలు
1. సెనగపప్పు ఒక కప్పు
2. కొబ్బరికోరు ఒక కప్పు
3. పచ్చిమిర్చి 4.
4. కరివేపాకు
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. నీళ్లు పప్పు ఉడకడానికి సరిపడా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 3 ,ఆయిల్ 3. స్పూన్స్.
తయారీ విధానం
ముందుగా సెనగ పప్పును శుభ్రంగా కడిగి ,
తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకుని ,చల్లార్చు కోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక ,
పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకు ,కొబ్బరికోరు లను వేసి,
అవి కూడా వేగాక , ముందుగా ఉడికించి పెట్టుకున్న సెనగ పప్పును వేసి ,
బాగా కలిపి , కొద్దిసేపు మగ్గనిచ్చి , తగినంత ఉప్పును వేసి,
బాగా కలిపి , స్టవ్ ఆఫ్ చేసుకుంటే ,
కొబ్బరికోరు సెనగపప్పు కూర రెడీ అవుతుంది
ఈ కూర అన్నం లోకి , చపాతీలోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi