ఆనపకాయ పెసరపప్పు పొడి కూర
కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయ ముక్కలు 4 కప్పులు
2. పెసర పప్పు 2 కప్పులు
3. పసుపు కొద్దిగా
4. కరివేపాకు
5. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 3
6. నీళ్లు తగినన్ని
1. ఆనపకాయ ముక్కలు 4 కప్పులు
2. పెసర పప్పు 2 కప్పులు
3. పసుపు కొద్దిగా
4. కరివేపాకు
5. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 3
6. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2 , ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2 , ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బాణలి లో ఆనపకాయ ముక్కలు వేసి ,
తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి .
ఆనపకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తరువాత ,
పెసరపప్పును కూడా వేసి ,అవసరమైతేకొద్దిగా నీళ్లు పోసుకుని ,
ఉడకనివ్వాలి . పప్పు ముక్కలు ఉడికిన తరువాత ,
చిల్లుల పళ్లెం లో వేసి చల్లారనివ్వాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,అవి దోరగా వేగాక,
కరివేపాకు ,పచ్చిమిర్చి చీలికలు వేసి ,వేగాక ,
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న, పప్పు ,ఆనపకాయ ముక్కలను ,
పసుపు ,తగినంత ఉప్పు వేసి , కొద్దిసేపు మగ్గనివ్వాలి .
కూర అంత బాగా పొడిగా అయ్యేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఆనపకాయ పెసరపప్పు పొడికూర రెడీ అవుతుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi