Monday, 5 December 2016

కేరట్ మెంతి ముక్కలు


కేరట్  మెంతి ముక్కలు

కావలిసిన  పదార్థాలు
1.  కేరట్లు  పావుకేజీ
2.   పసుపు  కొద్దిగా
3. నిమ్మకాయలు  2
4. ఆయిల్  8. స్పూన్స్
5. ఉప్పు  తగినంత

మెంతి  కారమునకు
 మినపప్పు  1 స్పూన్  , ఆవాలు  1. స్పూన్   , మెంతులు అర స్పూన్  ,
ఇంగువ  కొద్దిగా  ,ఎండుమిరపకాయలు

తయారీ  విధానం
ముందుగా  కేరట్లను  శుభ్రంగా  కడిగి  ,తుడిచి  ,ఆరబెట్టుకోవాలి .
ఆరిన  కేరట్లను చిన్నముక్కలుగా తరుగుకోవాలి .
నిమ్మరసమును ఒక  కప్పు లోకి   పిండుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి   వేడెక్కాక  ఒక  స్పూన్  ఆయిల్  వేసి
 పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  దోరగా  వేపుకుని,
చల్లార్చుకోవాలి  చల్లారిన  వీటిని
తగినంత  ఉప్పు  వేసి  మెత్తని  పొడిలాగా   గ్రైండ్   చేసుకోవాలి
ఒక  వెడల్పయిన  బేసిన్లోకి ,
తరిగిన  కేరట్  ముక్కలు  , మెంతి  కారము  , పసుపు , నిమ్మరసం   ,
ఆయిల్ వేసి  ,బాగా కలుపుకుని  , వూరనిస్తే
కేరట్ మెంతి  ముక్కలు  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi