పెసరపప్పు. కేబేజీ వడలు
కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు 1 కప్పు
2. సన్నగా తరిగిన కేబేజీ 1 కప్పు
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికిసరిపడా
5. పచ్చిమిర్చి 4.
6. అల్లం చిన్న ముక్క
7. కొత్తిమీర కొద్దిగా
8. గరం మసాలా పొడి 1 స్పూన్
9. ఆయిల్ పావులీటరు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి,
పెసరపప్పు ను 3 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన పెసరపప్పు ను శుభ్రం గా కడిగి ,తగినంత ఉప్పు,
పచ్చిమిర్చి , అల్లం ముక్క వేసి ,మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ పెసరపప్పు ముద్దలో ,సన్నగా తరిగిన కేబేజీని, కొత్తిమీరను వేసి,
బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి
ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు ,కేబేజీ ముద్దను
తీసుకుని ఒక ప్లాస్టిక్ కాగితం మీద వడ ల లాగ తట్టుకుని
ఆయిల్ లో వేసి దోరగా వేపుకుంటే
పెసరపప్పు కేబేజీ వడలు రెడీ అవుతాయి
వీటిని టొమాటో సాస్ తింటే రుచిగా ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi