రిబ్బన్ పకోడీ
కావలిసిన పదార్థాలు
1. సెనగ పిండి 1 కప్పు
2. వరిపిండి అర కప్పు
3. ఉప్పు రుచికి సరిపడా
4. కారం 1 స్పూన్
5. ఇంగువ కొద్దిగా
6. బేకింగ్ పొడి కొద్దిగా
7. ఆయిల్ పావు లీటరు
8. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లోకి సెనగ పిండి ,వరిపిండి ,
కారం ,ఉప్పు ,బేకింగ్ పొడి ,ఇంగువ , వేసి
బాగా కలిపి కాగిన ఆయిల్ ను వేసి ,
కలిపి ,తగినన్ని నీళ్లు పోసి ,బాగా కలిపి
జంతికలపిండి లాగ కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసుకుని ,జంతికలగొట్టం లో రిబ్బన్ పకోడీ ఛట్రం ,
పెట్టి కలుపుకున్న పిండిని, అందులో పెట్టి
జంతికలమాదిరి పిండి ని తిప్పి వేపుకుంటే
రిబ్బన్ పకోడీ రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi