నూనె గోంగూర
కావలిసిన పదార్థాలు
1. గోంగూర ఒక కట్ట
2. పచ్చి మిర్చి 10
3. పసుపు
4. ఉల్లిపాయ 1
5. నువ్వులనూనె అర కప్పు
6. కారం ఒకటిన్నర స్పూన్స్
7. ఉప్పు రుచికి సరిపడా
8. మెంతి పొడి అర స్పూన్
పోపు దినుసులు
సెనగపప్పు 2. స్పూన్స్ , మినపప్పు 1. స్పూన్ , ఆవాలు 1. స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2, కొంచెం ఇంగువ
తయారీ విధానం
ముందుగా గోంగూరను శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి.
ఉల్లి పాయను సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక , ఆయిల్ వేసి ,
ఆవాలు వేసి, వేగాక మినపప్పు, సెనగపప్పు , ఎండుమిరపకాయలు , వేసి
అవి దోరగా వేగాక , పచ్చిమిర్చి చీలికలు ,సన్నగా తరిగిన ఉల్లిపాయలు , వేసి
కొద్దిసేపు వేగనిచ్చి తరువాత,
సన్నగా తరిగిన గోంగూరను , పసుపును వేసి , కొద్దిసేపు మగ్గనిచ్చి ,
తరువాత ఉప్పు , మెంతి పొడి ,వేసి ,
బాగా కలిపి కారం కూడా వేసి
దగ్గర పడేంత వరకు ఉంచి , కొంచెం నూని వేడి చేసి , దానిలో ఇంగువ వేసి,
అందులోవేసి బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ,
నూనె గోంగూర రెడీ అవుతుంది
వేడి అన్నం లో నెయ్యి వేసుకు తింటే రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi