గుంత పొంగణాలు
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు 1 గ్లాసు
2. బియ్యం 2. గ్లాసులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. జీలకర్ర 1స్పూన్
5. ఉల్లిపాయలు 2
6. పచ్చిమిర్చి 2
7. అల్లం చిన్న ముక్క
8. కొత్తిమీర
9. కేరట్లు 2
10. ఆయిల్ పావుకప్పు
తయారీవిధానం
ముందుగా పొట్టు లేని మినపప్పు ను , బియ్యాన్ని
ఒక గిన్నెలో నీళ్లు పోసి 6 గంటలపాటు నానబెట్టుకోవాలి .
నానిన పప్పును ,బియ్యాన్ని శుభ్రంగా కడిగి,
తగినంత ఉప్పును వేసి ,
తగినన్ని నీళ్లు పోసి , మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఉల్లి పాయలు ,కేరట్లు ,అల్లం ,పచ్చి మిర్చి ,కొత్తిమీరలను ,
శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి .
రుబ్బిన మినప పిండి గరిట జారులాగా ఉండేలాగా చూసుకోవాలి.
గుంత పొంగణాల పాన్ తీసుకుని , స్టవ్ వెలిగించి ఈ పెనం పెట్టి
వేడెక్కాక ఆయిల్ రాసి ఒక గరిట పిండి ఒక్కొక్క గుంత లో వేసి
పైన తరిగిపెట్టుకున్న కూరముక్కలు ,జీలకర్ర వేసి , ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
దోరగా వేగనిచ్చితరువాత , తిరగేసి,
రెండో పక్కకూడా దోరగా వేగనిచ్చి
ఒక ప్లేట్ లోకి తీసుకుంటే
గుంత పొంగణాలు రెడీ
వీటిని అల్లం పచ్చడితో గాని, కొత్తిమీర పచ్చడితోగా ని తింటే రుచిగా ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.