Tuesday, 6 December 2016

సెనగలు వడలు


సెనగలు  వడలు

కావలిసిన పదార్థాలు
1. సెనగలు  పావుకేజీ
2.  పచ్చిమిర్చి  6.
3. అల్లం చిన్న  ముక్క
4.   వెల్లుల్లి  రెబ్బలు  6.
5. కొత్తిమీర
6.  పసుపు  కొద్దిగా
7. ఉప్పు  రుచికి  సరిపడ
8.   గరం మసాలా  పొడి  కొద్దిగా
9. ఆయిల్  పావు  లీటరు
తయారీ  విధానం
ముందుగా  సెనగలు  6. గంటలసేపు నీళ్లలో నానబెట్టాలి .
 నానిన  సెనగలను శుభ్రం గా  కడిగుకోవాలి .
సెనగలు  ,పచ్చిమిర్చి , అల్లం  ,వెల్లుల్లిరెబ్బలు , పసుపు. ,కొద్దిగా  గరం  మసాలాపొడి ,
తగినంత  ఉప్పు  వేసి మెత్తగా ,ముద్దలాగ గ్రైండ్ చేసుకోవాలి .
 స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  పోసుకోవాలి  . ముందుగా  మనం  గ్రైండ్  చేసి  పెట్టుకున్న  సెనగలముద్దను,
ప్లేస్టిక్ పేపర్ మీద  వేసి , వడల  మాదిరిగా  తట్టుకుని  ,
నూనిలో  దోరగా  వేపుకుంటే
సెనగలు వడలు రెడీ  అవుతాయి.

వీటిని  టమాటో  సాస్  తో గాని  , కొత్తిమీర పచ్చడి తో  గాని తింటే రుచిగా  ఉంటాయి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi