వంకాయ వేపుడు
కావలిసిన పదార్థాలు
1. వంకాయలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఉప్పు రుచికి సరిపడా
4. కూర కారం తగినంత
5. సెనగ పిండి 2 స్పూన్స్
6. ఆయిల్ 6 స్పూన్స్
తయారీ విధానం
కూర కారానికి
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ , ధనియాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా
విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి .
వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ
గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి .
వంకాయలను శుభ్రం గా కడిగి
ఒక మోస్తరు ముక్కలు గా తరుగుకోవాలి.
స్టవ్ వెలిగించి. వెడల్పయిన బాణలి పెట్టి ఆయిల్ వేసి
వంకాయ ముక్కలు ,పసుపు ,వేసి బాగా వేగనివ్వాలి
మధ్య మధ్య లో అట్లకాడతో కలుపుతూ ఉండాలి .
ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి .
బాగా వేగిన తరువాత సెనగ పిండిని వేసి బాగా కలిపి ,
కొద్దిసేపు వేగనిచ్చి , తగినంత ఉప్పు , కూర కారం వేసి ,
బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
వంకాయ వేపుడు రెడీ అవుతుంది
ఈ వేపుడు వేడి అన్నంలోను బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi