తోటకూర కందిపప్పు
కావలిసిన పదార్థాలు
1. తోటకూర 3 కట్టలు
2. కంది పప్పు 1 కప్పు
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 2.
6. వెల్లుల్లి రెబ్బలు 3
7. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరుగుకోవాలి.
కందిపప్పును శుభ్రం గా కడుగుకోవాలి .
ఒక బాణలి లో కందిపప్పును వేసి , తగినన్ని నీళ్లు పోసి,
ఉడికించుకోవాలి .పప్పు కొద్దిగా ఉడికిన తరువాత ,
తోటకూరను కూడా వేసి ,బాగా ఉడికిన తరువాత ,
చిల్లులపళ్లెము లోవేసి చల్లార్చుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులు ,వెల్లుల్లి రెబ్బలు వేసి ,
అవి దోరగా వేగాక పచ్చిమిర్చి చీలికలు ,ఉడికించుకున్న పప్పు తోటకూరను ,
పసుపు వేసి ,బాగా కలిపి, కొద్దిసేపు మగ్గనిచ్చి ,
తగినంత ఉప్పును వేసి, బాగా కలిపి ,
పొడిగా అయ్యేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
తోట కూర కందిపప్పు రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi