కేరట్ హల్వా
కావలిసిన పదార్థాలు
1. కేరట్లు అర కేజీ
2. పంచదార 100 గ్రాములు
3. పాలు అర కప్పు
4. నెయ్యి 50 గ్రాములు
5. ఏలకుల పొడి కొద్దిగా
6. జీడిపప్పు పలుకులు 15
7. కిస్మిస్ లు
తయారీ విధానం
ముందుగా కేరట్ లను శుభ్రం గా కడిగి ,
పైన వున్న తొక్క తీసి తురుముకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, కొద్దిగా నెయ్యి వేసి
కేరట్ తురుమును దోరగా వేపుకోవాలి.
జీడిపప్పు పలుకులు , కిస్మిస్ లు ,కూడా నెయ్యిలో వేపుకుని ,
ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
దోరగా వేగిన కేరట్ తురుము లో , అర కప్పు పాలు పోసి ,
మెత్తగా ఉడికించుకోవాలి .
మెత్తగా ఉడికిన తరువాత పంచదారను వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు ఉడకనిచ్చి, ఏలకులపొడి నెయ్యి వేసి ,
కలిపి బాగా దగ్గర పడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసి , ముందుగా వేపుకుని పెట్టుకున్న
జీడిపప్పు పలుకుల తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
కేరట్ హల్వా రెడీ అవుతుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi