కాకర కాయ బెల్లం పెట్టి కూర
కావలిసిన పదార్థాలు
1. కాకర కాయలు పావుకేజీ
2. ఉల్లిపాయ 1
3. కరివేపాకు
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
6. బెల్లం తగినంత
7. వరిపిండి 1 స్పూన్
8. చింత పండు కొద్దిగా
9. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా కాకర కాయలను శుభ్రం గా కడిగి , గుండ్రంగా చక్రాలుగా తరిగి ,
మధ్యలో వున్న గుజ్జును తీసివేయాలి .
ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి ,
ఇలా తరిగిన కాకర కాయ చక్రాలను ,
తగినన్ని నీళ్లు పోసి , కొద్దిగా చింతపండును వేసి ,
కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి
దోరగా వేగాక కరివేపాకును, ఉల్లిపాయ ముక్కలను వేసి ,
అవి కూడా దోరగా వేగిన తరువాత ,
ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ,
పసుపు ,ఉప్పు , బెల్లం , వరిపిండి , వేసి బాగా కలిపి ,
కొద్దిసేపు మగ్గనిచ్చి కూర అంతా దగ్గర. పడేంత వరకు ఉంచి ,
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
కాకర కాయ బెల్లం కూర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi