దొండకాయ ఉల్లి కారం కూర
కావలిసిన పదార్థాలు
1. దొండకాయలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఉప్పు రుచికి సరిపడా
4. ఆయిల్ 5స్పూన్స్
ఉల్లి కారమునకు
ఉల్లిపాయలు 2 , ఎండుమిరపకాయలు 6 , సెనగపప్పు 1 స్పూన్,
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ధనియాలు 1 స్పూన్ ,
తయారీ విధానము
ముందుగా దొండకాయలను శుభ్రం గా కడిగి ,
పైన కింద వున్న తొడిమలు తీసి ,
గుత్తి వంకాయ మాదిరిగా కాయలపడంగా తరుగుకోవాలి .
ఉల్లిపాయలను సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి , వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి, దోరగా వేపుకుని ,
ఒక ప్లేటులోకి తీసకుని చల్లార్చుకోవాలి .
మరల ఒక స్పూన్ ఆయిల్ వేసి , ఉల్లిపాయముక్కలు కూడా దోరగా వేపుకుని,
చల్లార్చుకోవాలి .
ముందుగా చల్లారిన పోపును , తగినంత ఉప్పు వేసి ,
మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
దీంట్లోనే వేపుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ,
మెత్తని ముద్దలాగ గ్రైండ్ చేసుకోవాలి .
ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారమును ,
తరిగి పెట్టుకున్న దొండకాయలలో కూరుకోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి వేడెక్కాక ,
3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
ఉల్లికారం కూరు కున్న దొండకాయలను వేసి, అట్లకాడ తో కలిపి ,
పైన మూత పెట్టి బాగా వేగనివ్వాలి.
మధ్య మధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి.
అవసరమైతే ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి .
కాయలన్ని బాగా వేగిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసుకుంటే ,
దొండకాయ ఉల్లికారం కూరరెడీ అవుతుంది.
ఈ కూరకి సన్నని లేతగా వుండే దొండకాయలు తీసుకుంటే కూర రుచిగా వస్తుంది
ఈ కూరను వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi