ఆరోగ్యానికి " మిరియాలు చారు "
మిరియాలలో ఆరోగ్య ప్రయోజనాలు
1. మిరియంలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.
2. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది.
3. మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.
4. మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, లక్షణాలు ఉన్నాయి.
5. మిరియాలు దగ్గు చికిత్సలోనే కాక క్యాన్సర్ ,మరియు ప్రేగు సమస్యల వంటి ఇతర వ్యాధుల నయంలో కూడా సహాయపడుతుంది.
6. రోజువారీ ఆహారంలో మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది
కావలిసిన పదార్థాలు
1. పచ్చిమిర్చి 2
2. చింత పండు కొద్దిగా
3. బెల్లం తగినంత
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
6. కొత్తిమీర కొద్దిగా
7. కరివేపాకు కొద్దిగా
8. నీళ్లు 4 గ్లాసులు
9. మిరియాలు 4
పోపు దినుసులు
ఆవాలు కొద్దిగా ,మెంతులు కొద్దిగా ,జీలకర్ర కొద్దిగా, ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయ 1 , ఆయిల్ 1 స్పూన్,
తయారీ విధానం.
మిరియాలను మెత్తని పొడిలాగా చేసుకోవాలి
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ,
అందులో చింత పండు ,బెల్లం ,ఉప్పు ,పసుపు ,మిరియాల పొడిని
పచ్చిమిర్చి ముక్కలు ,వేసి స్టవ్ మీద పెట్టి మరగ నివ్వాలి .
స్టవ్ పైన బాణలి పెట్టి ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి , వేగాక కరివేపాకును వేసి, వేగిన తరువాత
మరుగుతున్న రసం లో వేసి ఒక 5 నిమిషాల తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని , కొత్తిమీరను చల్లి మూత పెట్టుకుంటే.
" మిరియాలు చారు "రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi