" పూరీ "
కావలిసిన పదార్ధములు
1. గోధుమ పిండి 3 కప్పులు
2.మైదా పిండి 3. కప్పులు
3 ఉప్పు కొద్దిగా
4 నీళ్లు పిండి కలపడానికి సరిపడా
5. ఆయిల్ పావు లీటరు
తయారీ విధానము
ముందుగా ఒక వెడల్పయిన బేసిన్ లోకి గోధుమ పిండి , మైదాపిండి ,
ఉప్పులను వేసి బాగా కలిపి ,కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ,
పిండి ని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి .ఇలా కలుపుకున్న
పిండిని బౌల్ లో ఉంచి కాసేపు నాననివ్వాలి.
కలిపి పెట్టుకున్న పిండిని , చిన్న ఉండలుగా చేసుకుని ,
మధ్యస్తంగా , గుండ్రం గా ఒత్తుకోవాలి . దీనివలన పూరీ లు బాగా పొంగుతాయి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక వొత్తుకున్న పూరీ లను వేసి ,
ఆయిల్ లో మునిగిన తరువాత చిల్లుల గరిట తో ఒక సారి నెమ్మదిగా ,
నొక్కి పెట్టి ఉంచితే పూరి పొంగుతుంది.
బాగా పొంగినతరువాత , పూరి ని తిరగేసి , వేయించాలి .
వేగిన తరువాత , ఒక ప్లేట్ లో టిస్స్యు పేపర్ వేసి ,
పూరి ని , ఆయిల్ ఓడిన తరువాత ఆ పేపర్ మీద వెయ్యాలి.
మిగతా నూని ని పేపర్ పీల్చుకుంటుంది.
పూరి రెడీ అవుతుంది.
వేడి వేడి పూరీలను " శనగ పిండి బంగాళాదుంప "
కూర తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi