Sunday, 11 December 2016

పావ్ బాజీ


పావ్ బాజీ

కావలిసిన  పదార్థాలు
1. పావ్  లు  6.
2. బంగాళ  దుంపలు  3
3. కేరట్లు  3.
4. బీట్ రూట్  1.
5. పచ్చిబఠానీ లు  అర  కప్పు
6. పచ్చిమిర్చి  5.
7.  అల్లం  చిన్న  ముక్క
8.  వెల్లుల్లి రెబ్బలు  6
9. ఉల్లిపాయలు  4
10. టొమాటోలు  3
11. నిమ్మకాయ 1.
12. పసుపు  కొద్దిగా
13. కారం  కొద్దిగా
14.  గరం  మసాలాపొడి  2. స్పూన్స్
15. ధనియాలపొడి  1 స్పూన్
16.  ఉప్పు  రుచికి సరిపడా
17. కొత్తిమీర
18. నెయ్యి   6 స్పూన్స్
19.  ఆయిల్ 5 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  బంగాళ  దుంపలు  ,కేరట్ ,  బీట్ రూట్   ,పచ్చి బఠానీలను  ,
 శుభ్రంగా  కడుగుకోవాలి.  , కూరగాయలను ,
పైన  వున్న. తొక్కను  తీసి చిన్న  ముక్కలుగా  తరుగుకుని ,
ఆ ముక్కలను మరియు పచ్చి బఠానీలను
కుక్కరు  లో  పెట్టి  ఉడికించుకోవాలి
ఉల్లి పాయలు , టొమాటోలను  సన్నగా ,  చిన్న  ముక్కలుగాను  ,
పచ్చి  మిర్చిని  చీలికలుగాను  తరుగుకోవాలి.
ఒక  ఉల్లి పాయను  సన్నగా  తరుగుకుని , నిమ్మరసం పిండుకోవాలి .
అల్లం  వెల్లుల్లి  లను  మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి.
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి  ,
అల్లం  వెల్లుల్లి  ముద్దను  వేసి , పచ్చి వాసన  పోయేంత  వరకు  వేగనిచ్చి
తరిగి  పెట్టుకున్న ఉల్లిపాయ  ,టొమాటో  ముక్కలను వేసి ,
 కొద్దిసేపు మగ్గిన   తరువాత , ముందుగా  ఉడికించి  పెట్టుకున్న కూర  ముక్కలు  ,
పసుపు  ,ఉప్పు ,కారం  ,ధనియాల పొడి  ,గరంమసాలా పొడి ,
వేసి  బాగా కుమ్మి , దగ్గర పడేంత  వరకు  ఉంచి ,
స్టవ్  ఆఫ్  చేసుకుని,
 కూరను  ఒక  బౌల్  లోకి  తీసికుని ,
పైన కొత్తిమీర  చల్లుకుంటే  పావ్  బాజీ  కూర  రెడీ  అవుతుంది  .

పావులను  తీసుకుని , మధ్యలోకి  చాకుతో  కట్  చేసుకోవాలి.
 స్టవ్  వెలిగించి ,పెనం పెట్టి   వేడెక్కాక
నెయ్యి   వేసుకుని  , పావులను  దోరగా  కాల్చుకుని ,
 రెండు  పావ్  లకి  మధ్యలో  కూర పెట్టి  ,
పక్కన  కూర  నిమ్మ రసం  పిండిన ఉల్లిపాయ ముక్కలతో
సర్వ్  చేసుకుంటే రుచికరమైన  పావ్  బాజీ  రెడీ.

* ఈ కూర  చపాతీలలోకి  కూడా  బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi