Thursday, 29 December 2016

సగ్గుబియ్యంలో


1. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

2. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.

3. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం.

4. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది.

5. తక్షణ శక్తినిచ్చే అహార పదార్ధంగా దీన్ని ఉపయోగిస్తారు.

6. కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాలా ముఖ్యం.

7. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల కండరాలు పెరగడమే కాకుండా బలంగా మారుతాయి.

8. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

9. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు.. బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల.. రక్తప్రసరణ సజావుగా సాగి.. గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

10. సగ్గు బియ్యంను పాల లేదా నీటితో ఉడికించి ,తర్వాత పంచదార మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి.

11. ఇందులో విటమిన్ కె ఉంటుంది.

12. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతేమా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Wednesday, 28 December 2016

కాకర కాయ బెల్లం పెట్టి కూర


కాకర  కాయ  బెల్లం  పెట్టి  కూర

కావలిసిన  పదార్థాలు
1. కాకర  కాయలు  పావుకేజీ
2.  ఉల్లిపాయ  1
3. కరివేపాకు
4. పసుపు  కొద్దిగా
5. ఉప్పు  రుచికి  సరిపడా
6.  బెల్లం  తగినంత
7.  వరిపిండి  1 స్పూన్
8. చింత  పండు  కొద్దిగా
9. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
 సెనగ పప్పు  1 స్పూన్ , మినపప్పు  1 స్పూన్ , ఆవాలు  అర  స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్  ఎండుమిరపకాయలు  2, ఆయిల్  2  స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  కాకర  కాయలను శుభ్రం  గా  కడిగి ,  గుండ్రంగా  చక్రాలుగా తరిగి ,
మధ్యలో  వున్న గుజ్జును  తీసివేయాలి .
 ఉల్లిపాయలను  సన్నగా  తరుగుకోవాలి ,
ఇలా  తరిగిన  కాకర కాయ  చక్రాలను ,
 తగినన్ని  నీళ్లు  పోసి ,   కొద్దిగా  చింతపండును  వేసి ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి  పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి
దోరగా  వేగాక   కరివేపాకును, ఉల్లిపాయ ముక్కలను  వేసి ,
అవి కూడా  దోరగా  వేగిన  తరువాత  ,
ముందుగా   ఉడికించి  పెట్టుకున్న  కాకరకాయ  ముక్కలు  ,
పసుపు  ,ఉప్పు  , బెల్లం  , వరిపిండి ,  వేసి  బాగా   కలిపి  ,
కొద్దిసేపు  మగ్గనిచ్చి కూర  అంతా  దగ్గర. పడేంత  వరకు  ఉంచి ,
 స్టవ్   ఆఫ్  చేసుకుంటే
కాకర  కాయ  బెల్లం  కూర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Tuesday, 27 December 2016

బేబీ పొటాటోస్ ఉల్లికారం కూర


బేబీ  పొటాటోస్  ఉల్లికారం  కూర

కావలిసిన  పదార్థాలు
1. బేబీ  పొటాటోస్. పావుకేజీ
2. పసుపు  
3. ఆయిల్ 5 స్పూన్స్

ఉల్లికారమునకు
 ఉల్లిపాయలు  2,  ఎండుమిరపకాయలు  6,  సెనగపప్పు  1 స్పూన్  ,
మినపప్పు  1 స్పూన్  ,ధనియాలు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  ,జీలకర్ర  అరస్పూన్  ,
ఉప్పు  రుచికి  సరిపడా

తయారీ  విధానం
 ముందుగా  బేబీ  పొటాటాస్  ను  శుభ్రం  గా కడిగి  ,
పైన  వున్న  తొక్కను  తీసి  కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని  చల్లారబెట్టుకోవాలి  .
ఉల్లిపాయలను  సన్నగా  చిన్న ముక్కలుగా  తరువుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  దోరగా  వేపుకుని  ,
ఒక ప్లెట్  లోకి  తీసుకుని  చల్లార్చికోవాలి.
 అదే  బాణలిలో  కొద్దిగా  ఆయిల్  వేసి  ,తరిగిపెట్టుకున్నఉల్లిపాయ  ముక్కలను  వేసి  ,
దోరగా  వేపుకుని, చల్లార్చుకోవాలి .
చల్లారిన  పోపును  తగినంత  ఉప్పు  వేసి ,మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని ,
తరువాత వేపుకుని  పెట్టుకున్న  ఉల్లిపాయ  ముక్కలను  కూడా  వేసి  ,
మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్   వెలిగించి  వెడల్పయిన  బానలిపెట్టి  ,వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
ముందుగా ఉడికించి  చల్లారబెట్టుకున్న  బేబీ  పొటాటోస్  ను వేసి  ,
దోరగా వేపువేపుకొవాలి  .
ముందుగా  మనం  తయారుచేసి  పెట్టుకున్న  ఉల్లికారమును  కూడా  బాగా  కలిపి ,
ఒక స్పూన్  ఆయిల్  వేసి , కొద్దిసేపు  మగ్గనిచ్చి ,
 స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 బేబీ పొటాటోస్  ఉల్లికారం  కూర  రెడీ  అవుతుంది
ఈ కూర అన్నము  లోకి  చపాతీలలోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Sunday, 25 December 2016

బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్


బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్

కావలిసిన  పదార్థాలు
1. బంగాళాదుంపలు  3
2. గ్రీన్ పీస్  అర కప్పు
3. బ్రెడ్ స్లైసెస్  8
4. గరం మసాలాపొడి  అర స్పూన్
5. అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్
6. జీడిపపప్పు  పొడి  1 స్పూన్
7. కారం  1 స్పూన్
8. ఉప్పు  రుచికి  సరిపడా
9.  కొత్తిమీర  తురుము  1 స్పూన్
10. జీలకర్ర  పొడి  1 స్పూన్
11.   ధనియాల  పొడి  1 స్పూన్
12.  ఆయిల్  4 స్పూన్స్
13.   నెయ్యి

తయారీ  విధానం
ముందుగా  బంగాళదుంపలను , గ్రీన్ పీస్  ను  శుభ్రం  గా  కడిగి ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకోవాలి . చల్లారిన  బంగాళదుంపలను  ,
పైన  వున్న తొక్కను  తీసి ఒక పక్కన  పెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి,
అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి  , దోరగా  వేగాక ,
బంగాళదుంపలను  ,గ్రీన్ పీస్  ను  ,పసుపు ,
,ఉప్పు  ,కారం  ,జీలకర్రపొడి  ,ధనియాలపొడి  ,
జీడిపప్పుపొడి  ని , వేసి  ,బాగా కలిపి  కొద్దిసేపు  మగ్గనివ్వాలి .
ఒక బౌల్ లోకి  కూరను  తీసుకుని  ,పైన  కొత్తిమీరను  చల్లుకోవాలి ,
కూరను గట్టిగా  లేకుండా  చూసుకోవాలి .
స్టవ్  పైన  పెనం  పెట్టి  వేడెక్కాక , నెయ్యి  వేసి  ,బ్రెడ్  స్లైసెస్ ను  వేసి ,
దోరగా  కాల్చుకోవాలి  .
కాల్చుకున్న  రెండు  బ్రెడ్  స్లైసెస్  మధ్య
మనం తయారుచేసి  పెట్టుకున్న  కూరను  పెట్టి  సర్వ్  చేసుకోవాలి.
బంగాళాదుంప బ్రేడ్ టోస్ట్ రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Saturday, 24 December 2016

" పూరీ"


" పూరీ "

కావలిసిన పదార్ధములు
1. గోధుమ పిండి 3 కప్పులు
2.మైదా  పిండి   3. కప్పులు
3 ఉప్పు కొద్దిగా
4 నీళ్లు పిండి కలపడానికి సరిపడా
5. ఆయిల్ పావు లీటరు

తయారీ  విధానము
ముందుగా ఒక వెడల్పయిన బేసిన్ లోకి గోధుమ పిండి , మైదాపిండి ,
ఉప్పులను వేసి బాగా కలిపి ,కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ,
పిండి ని చపాతీ పిండి  మాదిరిగా  కలుపుకోవాలి .ఇలా  కలుపుకున్న
 పిండిని  బౌల్ లో ఉంచి కాసేపు నాననివ్వాలి.

కలిపి  పెట్టుకున్న  పిండిని , చిన్న  ఉండలుగా  చేసుకుని  ,
మధ్యస్తంగా , గుండ్రం గా ఒత్తుకోవాలి . దీనివలన  పూరీ లు  బాగా పొంగుతాయి .

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  వొత్తుకున్న  పూరీ లను వేసి ,
ఆయిల్  లో మునిగిన తరువాత చిల్లుల గరిట తో ఒక సారి  నెమ్మదిగా ,
నొక్కి పెట్టి ఉంచితే పూరి పొంగుతుంది.
బాగా పొంగినతరువాత , పూరి ని తిరగేసి , వేయించాలి .

 వేగిన  తరువాత  , ఒక ప్లేట్ లో టిస్స్యు పేపర్ వేసి ,
పూరి ని ,  ఆయిల్ ఓడిన తరువాత ఆ పేపర్ మీద వెయ్యాలి.
మిగతా నూని ని పేపర్ పీల్చుకుంటుంది.
పూరి రెడీ అవుతుంది.
 వేడి వేడి పూరీలను " శనగ పిండి బంగాళాదుంప "
కూర  తో  సర్వ్  చేసుకుంటే  బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

పూరీ సెనగ పిండికూర


పూరీ  సెనగ పిండికూర
కావలిసిన పదార్థాలు
1.  ఉల్లిపాయలు 5
2. బంగాళాదుంపలు 2
3. కేరట్లు 2
4. పసుపు కొద్దిగా
5. సెనగపిండి 3 స్పూన్స్
6. పచ్చిమిర్చి 3
7. అల్లం చిన్న ముక్క
8. కరివేపాకు9. పంచదార 1 స్పూన్
10. నీళ్లు కూరకి సరిపడా
11. ఉప్పు రుచికి సరిపడా
12. కొత్తిమీర

పోపుదినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఎండుమిరపకాయ 1, ఆయిల్  2 స్పూన్స్

తయారీ విధానం
ఉల్లిపాయలను  చీలికలుగాను   ,అల్లమును  చిన్న  ముక్కలుగా  ,
పచ్చిమిర్చిని  చీలికలుగాను , బంగాళాదుంప,  కేరట్  లను  ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .

సెనగ పిండిని ఒక  బౌల్ లోకి  తీసుకుని , అందులో  ఒక  స్పూన్  పంచదారను ,
ఒక  గ్లాసు  నీళ్లను  పోసి  ,ఉండలు  లేకుండా  కలుపుకోవాలి  .

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి,   పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  ,
దోరగా  వేగాక  ,
తరిగి పెట్టుకున్న  కూర  ముక్కలను,  కరివేపాకును,  పసుపు ,
 ఉప్పు ను  వేసి  బాగా కలిపి , తగినన్ని  నీళ్లు  పోసి   ,ఉడకనిచ్చి  ,
దీంట్లో  ముందుగా  నీళ్లలో  కలిపి  పెట్టుకున్న ,
 సెనగ పిండిని  వేసి  బాగా  కలిపి ఉడకనివ్వాలి  .

మధ్య  మధ్య లో  కలుపుతూ  ఉండాలి  లేకపోతే
అడుగంటుతుంది .
కూర  బాగా  దగ్గర  పడ్డాక  ,ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,
కొత్తిమీర  తో  గార్నిష్  చేసుకుంటే  పూరీ   సెనగ  పిండి  కూర
రెడీ   అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi




సాష్టాంగ నమస్కారం


సాష్టాంగ నమస్కారం

స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.
అలా నమస్కారం చేసే
సమయంలో ఈ శ్లోకం చదవాలి.

" ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే "

అష్టాంగాలు :
ఉరసు అంటే తొడలు,
శిరసు అంటే తల,
దృష్టి అనగా కళ్ళు,
మనసు అనగా హృదయం,
వచసు అనగా నోరు,
పద్భ్యాం - పాదములు,
కరాభ్యాం - చేతులు,
కర్నాభ్యాం - చెవులు.
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు
తగిలించాలి.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Friday, 23 December 2016

దొండకాయ ఉల్లి కారం కూర


దొండకాయ  ఉల్లి  కారం  కూర

కావలిసిన  పదార్థాలు
1. దొండకాయలు  పావుకేజీ
2.   పసుపు  కొద్దిగా
3. ఉప్పు రుచికి  సరిపడా
4. ఆయిల్ 5స్పూన్స్

ఉల్లి కారమునకు
ఉల్లిపాయలు  2 , ఎండుమిరపకాయలు  6 , సెనగపప్పు  1 స్పూన్,
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ ,
 ధనియాలు  1 స్పూన్ ,

తయారీ  విధానము
ముందుగా  దొండకాయలను  శుభ్రం గా  కడిగి ,
పైన  కింద  వున్న  తొడిమలు  తీసి ,
గుత్తి వంకాయ  మాదిరిగా  కాయలపడంగా  తరుగుకోవాలి  .

ఉల్లిపాయలను  సన్నగా చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి.

స్టవ్  వెలిగించి   బాణలి  పెట్టి ,  వేడెక్కాక  ఒక  స్పూన్  ఆయిల్  వేసి   ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి,   దోరగా  వేపుకుని ,
 ఒక  ప్లేటులోకి  తీసకుని  చల్లార్చుకోవాలి .

మరల ఒక  స్పూన్  ఆయిల్  వేసి   , ఉల్లిపాయముక్కలు  కూడా   దోరగా  వేపుకుని,
చల్లార్చుకోవాలి .
ముందుగా  చల్లారిన  పోపును , తగినంత  ఉప్పు  వేసి  ,
మెత్తని  పొడిలాగా   గ్రైండ్ చేసుకుని ,
దీంట్లోనే  వేపుకున్న  ఉల్లిపాయ  ముక్కలను  వేసి   ,
మెత్తని  ముద్దలాగ  గ్రైండ్  చేసుకోవాలి .

ఇలా  గ్రైండ్  చేసి  పెట్టుకున్న  ఉల్లి కారమును  ,
తరిగి పెట్టుకున్న  దొండకాయలలో  కూరుకోవాలి .

 స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక   ,
3  స్పూన్స్  ఆయిల్  వేసి  ,
ఉల్లికారం కూరు కున్న  దొండకాయలను  వేసి, అట్లకాడ తో  కలిపి  ,
పైన  మూత  పెట్టి  బాగా  వేగనివ్వాలి.

మధ్య  మధ్యలో  అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి.
అవసరమైతే  ఆయిల్  కూడా  వేస్తూ  ఉండాలి  .
కాయలన్ని  బాగా  వేగిన  తరువాత, స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ,

దొండకాయ  ఉల్లికారం  కూరరెడీ  అవుతుంది.

ఈ  కూరకి  సన్నని  లేతగా  వుండే  దొండకాయలు  తీసుకుంటే  కూర  రుచిగా  వస్తుంది
ఈ కూరను  వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తింటే  రుచిగా  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi


దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు


దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి.

2. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది.

3. బంగారం ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి.

4. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది

5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ  దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది ఈశ్వరలోక దర్శనం
      కలుగుతుంది.
14. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది.

15. పండ్లను దానంచేస్తే బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Thursday, 22 December 2016

చిక్కుడు కాయ వేపుడు


చిక్కుడు  కాయ  వేపుడు

కావలిసిన  పదార్థాలు
1. చిక్కుడుకాయలు  పావుకేజీ
2. పసుపు
3. కొద్దిగా  ఉప్పు  రుచికి  సరిపడా
4. కారం  తగినంత
5. ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానము
ముందుగా  చిక్కుడుకాయలును  శుభ్రం  గా  కడిగి
ఈనెలు  తీసి  రెండు ముక్కలుగా  చేసుకోవాలి   .
స్టవ్  వెలిగించి బాణలి  పెట్టి  వేడెక్కాక  , ఆయిల్  వేసి  చిక్కుడుకాయముక్కలను ,
పసుపు  వేసి బాగా  కలిపి,  పైన  మూత  పెట్టి ,  మూత  మీద  కొద్దిగా  నీళ్లు  పోసుకోవాలి  .
మూత  మీద  నీళ్లు పోసుకోవడం  వలన  కూర  తొందరగా  మగ్గుతుంది .
మధ్యమధ్యలో  కలుపుతూ  ఉండాలి  . చిక్కుడుకాయ  ముక్కలు  బాగా వేగిన  తరువాత ,
 తగినంత ఉప్పు  కారం  వేసి ,  బాగా  కలిపి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ,
చిక్కుడుకాయ  వేపుడు రెడీ అవుతుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Wednesday, 21 December 2016

గ్రీన్ పీస్ మసాలా కర్రి


గ్రీన్ పీస్  మసాలా  కర్రి

కావలిసిన  పదార్థాలు
1.   గ్రీన్  పీస్  1 పేకెట్
2.  ఉల్లిపాయలు  4
4. టమాటోలు  3
5. పచ్చిమిర్చి  2
6. అల్లం  చిన్న  ముక్క
7.  వెల్లుల్లిరెబ్బలు  5
8. పసుపు  కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. కారం కొద్దిగా
11. ధనియాలపొడి  1 స్పూన్
12. గరం  మసాలా పొడి 1 స్పూన్
12. పెరుగు  3 స్పూన్స్
14. పల్లీలు  1 స్పూన్
15.  జీడిపప్పు పలుకులు 6
16. కొత్తిమీర
17.   ఆయిల్ 6 స్పూన్స్
18. నీళ్లు  తగినన్ని

తయారీ  విధానం
ముందుగా  గ్రీన్ పీస్  ను శుభ్రం  గా  కడిగి  ,తగినన్ని  నీళ్లు  పోసి ,
ఉడికించుకుని  చల్లార్చు కోవాలి.
2 ఉల్లిపాయలను  సన్నగా తరుగుకుని పక్కన పెట్టు కోవాలి.

అల్లం,   వెల్లుల్లి,  పచ్చిమిర్చి  ని  కలిపి  మెత్తని  ముద్దలాగ ,
మరియు  టొమాటో  , ఉల్లిపాయలను  కూడా  మెత్తని  పేస్టు లాగ  గ్రైండ్  చేసుకోవాలి  .

పల్లీ లు  ,జీడిపప్పు  పలుకులను , దోరగా  వేపుకుని ,
చల్లారాక  మెత్తని  ముద్ద  లాగ  గ్రైండ్  చేసుకోవాలి.

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి ,
అల్లం వెల్లుల్లి  పేస్టు  వేసి  పచ్చి  వాసన పోయేంత వరకు  వేపుకుని,
తరిగిపెట్టిన  ఉల్లిపాయ ముక్కలను  వేసి
అవి  దోరగా  వేగాక,
టొమాటో ఉల్లిపాయ  ముద్దను  కూడా  వేసి  ,
పచ్చివాసన  పోయేంత  వరకు  వేపుకుని  ,
దీంట్లో
ముందుగా ఉడికించి  పెట్టుకున్న  గ్రీన్ పీస్  ను  , పసుపు  ,
ఉప్పు ,  కారం ,  ధనియాల  పొడి , గరం  మసాలా  పొడులను  వేసి బాగా  కలిపి
తగినన్ని  నీళ్లు  పోసి ఉడకనివ్వాలి  .

కొద్దిసేపు  ఉడికిన తరువాత  పెరుగును  కూడా  వేసి  ఉడకనివ్వాలి .

తరువాత  పల్లీ , జీడీ పప్పు  ముద్దను  కూడా  వేసి  బాగా  కలిపి  ,
కూర  అంతా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి  ,

స్టవ్  ఆఫ్  చేసుకుని   ఒక  బౌల్  లోకి  తీసుకుని
 పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
గ్రీన్ పీస్  మసాలా కర్రీ  రెడీ  అవుతుంది

ఈ కూర  చపాతీలలోకి కొబ్బరి అన్నం  లోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi





Tuesday, 20 December 2016

కూర కారం చల్లిన బేబీ పొటాటోస్ వేపుడు


కూర కారం చల్లిన బేబీ పొటాటోస్   వేపుడు

కావలిసిన పదార్థాలు
1. బేబీ పొటాటోస్ పావుకేజీ
2. ఆయిల్ 5 స్పూన్స్

కూర కారానికి
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర  స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ , ధనియాలు 1 స్పూన్
 ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా

విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి,
 దోరగా వేపుకోవాలి .వీటిని చల్లారాక ఉప్పు వేసి ,
మెత్తగా పొడి లాగ
గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి .

బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడిగి ,
ఉడికించి చల్లారబెట్టుకోవాలి .
పైన తొక్క తీసి ఒక పక్కన పెట్టుకోవాలి .

స్టవ్ పైన బాణలి పెట్టి ఆయిల్ వేసి
ఉడికించి చల్లార బెట్టుకున్న  బేబీ పొటాటోస్ వేసి
దోరగా వేగనివ్వాలి . మధ్య మధ్య లో
అట్లకాడ తో కలుపుతూ ఉండాలి
ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి
బాగా దోరగా వేగిన తరువాత,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
కూర కారం చల్లు కుంటే,
బేబీ పొటాటోస్ వేపుడు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

" దర్భ " యొక్క ప్రాముఖ్యం


" దర్భ " యొక్క ప్రాముఖ్యం

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది.
ఈ దర్భలో చాలా జాతులున్నాయి.
వీటిలో
1. కుశ జాతి దర్భను శుకర్మలకు,
2. బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు,
3. శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను
    గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి.

కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు.

కూర్మ పురాణం ప్రకారం,

విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది.

వరాహ పురాణం ప్రకారం,

ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి,
 భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు .
కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు.

" శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం " 

అని భగవద్గీతలో చెప్పబడింది.
దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు.

ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది.

ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు.
వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ
దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది.

శుభప్రదమయిన వాటికి           :రెండు ఆకుల దర్భని,
పూజా తదితర కార్యక్రమాలకు : నాలుగు ఆకుల దర్భని
                                                ఉంగరముగా వాడవలెననీ ఉంది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము - 

దేవతలనూ, సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో
ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

 దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి.
ఎందుకంటే ఈ వేరులు మాత్రమే విజయాన్ని చేకూరుస్తాయని అంటారు.

అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.
వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట.

ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది.

దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది.
ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా,
వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట.

వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:

" విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ. " 

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో,  వీటి విలువ తెలిసింది
కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Monday, 19 December 2016

రిబ్బన్ పకోడీ


రిబ్బన్  పకోడీ

కావలిసిన  పదార్థాలు
1. సెనగ పిండి  1 కప్పు
2. వరిపిండి  అర  కప్పు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. కారం  1 స్పూన్
5. ఇంగువ  కొద్దిగా
6.  బేకింగ్ పొడి  కొద్దిగా
7. ఆయిల్  పావు  లీటరు
8. నీళ్లు  తగినన్ని

తయారీ  విధానం
ముందుగా   ఒక  బౌల్  లోకి సెనగ పిండి  ,వరిపిండి ,
 కారం  ,ఉప్పు  ,బేకింగ్ పొడి  ,ఇంగువ ,  వేసి
 బాగా  కలిపి  కాగిన   ఆయిల్  ను  వేసి ,
 కలిపి  ,తగినన్ని  నీళ్లు  పోసి ,బాగా  కలిపి
జంతికలపిండి లాగ   కలుపుకోవాలి   .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసుకుని  ,జంతికలగొట్టం లో  రిబ్బన్ పకోడీ  ఛట్రం  ,
పెట్టి కలుపుకున్న  పిండిని,  అందులో  పెట్టి
జంతికలమాదిరి పిండి ని  తిప్పి వేపుకుంటే
రిబ్బన్  పకోడీ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

లక్ష్మీ కటాక్షం లభించాలంటే


లక్ష్మీ కటాక్షం లభించాలంటే

1. ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.
2. సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి.
3. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప
    హారతులు   ఇవ్వాలి.
4. .ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.
5. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.
6. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయ అల్పాహారం తినకూడదు.
7. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.
8. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి.
9. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి.
10. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి.
11. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
12. ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాని శ్రీ వినాయకుడిని దర్శించుకుని వెళ్ళాలి.
13. శ్రీమహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి.
14. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో ముఖం తూర్పువైపు లేదా పశ్చిమంవైపు ఉండేలా చూసుకోండి.
15. ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి, సాలెగూళ్ళు, మట్టి, చెత్త విరిగిపోయిన వస్తువులను సర్థుకోవాలి.
16. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు.
17. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.
18. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.
19.  ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
20. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.
21. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.
22. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.
23. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.
24. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.
25. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.
26. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
27. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
28. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.
29. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.
30. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
31. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.
32. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.
33. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె
       అనుగ్రహం పొందలేరు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Sunday, 18 December 2016

పొటాటో పాలకూర కర్రీ


పొటాటో పాలకూర  కర్రీ


కావలిసిన  పదార్థాలు
1. పాలకూర  2 కట్టలు
2.  పొటాటోస్  పావుకేజీ
3.  అల్లం  చిన్న  ముక్క
4. వెల్లుల్లి రెబ్బలు 4
5. ఉల్లిపాయలు 2.
6. పచ్చిమిర్చి  4
7. జీలకర్ర  1 స్పూన్
8. ధనియాల  పొడి 2 స్పూన్స్
9. పసుపు కొద్దిగా
10. ఉప్పు రుచికి సరిపడా
11.   కారం  1 స్పూన్
12. గరంమసాలా పొడి  2 స్పూన్స్
13. ఆయిల్ 6  స్పూన్స్
14.  నీళ్లు  1 గ్లాసు

తయారీ  విధానం
ముందుగా   పొటాటోస్  ను  శుభ్రం గా  కడిగి,  
తగినన్ని  నీళ్లు  పోసి  కుక్కరులో  పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి .
చల్లారిన తరువాత పైన ఉన్న తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఉల్లి పాయలను  సన్నగా  తరుగుకోవాలి .
అల్లం ,  వెల్లుల్లి ని కలిపి  మెత్తని  పేస్ట్  లాగ  గ్రైండ్  చేసుకోవాలి .
పచ్చిమిర్చిని  చీలికలుగా  చేసుకోవాలి  .

పాలకూరను  శుభ్రం గా  కడిగి , సన్నగా తరుగుకుని
స్టవ్ పైన  బాణలి  పెట్టి  1 స్పూన్  ఆయిల్ వేసి ,
పచ్చివాసన  పోయేంత  వరకు  మగ్గబెట్టి  , చల్లారాక
మెత్తని  ముద్దలాగ  గ్రైండ్  చేసుకోవాలి   .

స్టవ్   వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక,
3  స్పూన్స్  ఆయిల్  వేసి  , ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న
పొటాటో ముక్కలు ను వేసి  దోరగా వేపుకోవాలి .

 స్టవ్  మీద  వేరే  బాణలి పెట్టి  , వేడెక్కాక,
2 స్పూన్స్  ఆయిల్  వేసి అల్లం  వెల్లుల్లి  ముద్దను  వేసి  ,
దోరగా  వేగాక  , పచ్చిమిర్చి  చీలికలు  ,ఉల్లిపాయముక్కలు  ,
వేసి  అవి కూడా  దోరగా  వేగిన తరువాత ,

 పాలకూర ముద్దను  ,పసుపు  , కారం,
ధనియాలపొడి  , గరంమసాలా  పొడి  , తగినంత  ఉప్పు  ,
వేసి  బాగా  కలిపి  , ఒక  గ్లాసు  నీళ్లు  పోసి  , దగ్గర పడేంత  వరకు  ఉంచి,

ముందుగా  దోరగా  వేపుకుని  పెట్టుకున్న  పొటాటో ముక్కలను  వేసి
బాగా  కలిపి  కొద్దిసేపు  ఉంచి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 పొటాటో పాలక్  కర్రీ రెడీ  అవుతుంది

ఈ  కూర అన్నం లోకి  చపాతీ లలోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer 's:
Achanta Subhadevi
Achanta Subbalakshmi



Saturday, 17 December 2016

పెసరపప్పు. కేబేజీ వడలు


పెసరపప్పు. కేబేజీ  వడలు

కావలిసిన  పదార్థాలు
1.  పెసరపప్పు   1 కప్పు
2. సన్నగా తరిగిన  కేబేజీ  1 కప్పు
3.   పసుపు  కొద్దిగా
4. ఉప్పు  రుచికిసరిపడా
5.   పచ్చిమిర్చి  4.
6. అల్లం  చిన్న ముక్క
7. కొత్తిమీర  కొద్దిగా
8.  గరం మసాలా  పొడి  1 స్పూన్
9. ఆయిల్   పావులీటరు

తయారీ  విధానం
ముందుగా   ఒక  గిన్నెలో తగినన్ని  నీళ్లు  పోసి,
 పెసరపప్పు ను  3  గంటలసేపు  నానబెట్టుకోవాలి  .
నానిన  పెసరపప్పు ను  శుభ్రం  గా  కడిగి ,తగినంత  ఉప్పు,
పచ్చిమిర్చి , అల్లం  ముక్క  వేసి  ,మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .
ఈ పెసరపప్పు  ముద్దలో  ,సన్నగా తరిగిన   కేబేజీని,  కొత్తిమీరను  వేసి,
బాగా  కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి
ముందుగా మనము రెడీ  చేసి పెట్టుకున్న  పెసరపప్పు  ,కేబేజీ  ముద్దను
తీసుకుని  ఒక ప్లాస్టిక్  కాగితం   మీద  వడ ల లాగ  తట్టుకుని
ఆయిల్  లో  వేసి  దోరగా  వేపుకుంటే
 పెసరపప్పు  కేబేజీ  వడలు  రెడీ  అవుతాయి
వీటిని  టొమాటో  సాస్  తింటే  రుచిగా  ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

ఆనపకాయ పెసరపప్పు పొడి కూర


ఆనపకాయ  పెసరపప్పు  పొడి  కూర

కావలిసిన  పదార్థాలు
1. ఆనపకాయ ముక్కలు  4 కప్పులు
2.  పెసర  పప్పు  2 కప్పులు
3. పసుపు  కొద్దిగా
4.  కరివేపాకు
5. ఉప్పు  రుచికి  సరిపడా
5. పచ్చిమిర్చి  3
6. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
మినపప్పు 1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్  ,జీలకర్ర  అర  స్పూన్  ,
ఎండుమిరపకాయలు  2 , ఇంగువ  కొద్దిగా  ,ఆయిల్ 2 స్పూన్స్

తయారీ  విధానం
 ముందుగా  బాణలి లో  ఆనపకాయ  ముక్కలు వేసి ,
తగినన్ని  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి .
ఆనపకాయ  ముక్కలు  కొద్దిగా  ఉడికిన  తరువాత ,
పెసరపప్పును  కూడా  వేసి  ,అవసరమైతేకొద్దిగా  నీళ్లు  పోసుకుని   ,
ఉడకనివ్వాలి  . పప్పు ముక్కలు  ఉడికిన తరువాత ,
చిల్లుల  పళ్లెం  లో  వేసి  చల్లారనివ్వాలి .
 స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  ,అవి  దోరగా  వేగాక,
కరివేపాకు  ,పచ్చిమిర్చి  చీలికలు  వేసి  ,వేగాక ,
 ముందుగా  ఉడికించి  చల్లార బెట్టుకున్న,   పప్పు  ,ఆనపకాయ  ముక్కలను  ,
పసుపు  ,తగినంత  ఉప్పు   వేసి , కొద్దిసేపు  మగ్గనివ్వాలి   .
కూర అంత  బాగా  పొడిగా  అయ్యేంత  వరకు  ఉంచి
 స్టవ్  ఆఫ్  చేసుకుంటే
ఆనపకాయ  పెసరపప్పు  పొడికూర  రెడీ  అవుతుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

జగన్నాథ క్షేత్రం//// పూరి


జగన్నాథ క్షేత్రం///పూరి

స్థలపురాణం :
కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు. అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు. అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు. అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.

ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి.. పూరి సముద్ర తీరానికి వెళ్తే అక్కడ ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందనీ.. దానిని దారుశిల్పంగా చెక్కమని ఆదేశించాడు. దాంతో ఆ రాజు నిద్రనుంచి మేలుకుని అప్పటికప్పుడే అక్కడకు బయలుదేరుతాడు. విష్ణువు చెప్పినట్లుగానే నీటి అలలపై తేలియాడుతున్న ఒక కొయ్యదుంగ ఆ రాజుకు కనిపిస్తుంది. అదే సమయంలో విష్ణువు, విశ్వకర్మ ఇద్దరూ వృద్ధశిల్పకళాకారుల వేషంలో అతని దగ్గరకు చేరుకుంటారు.

వారిముగ్గురి మధ్య కొద్దిసేపటివరకు సంభాషణలు జరిగిన అనంతరం... వారిద్దరూ ఆ కొయ్యదుంగను విగ్రహాలుగా చెక్కేపని తామే చేస్తామని ఒప్పుకుంటారు. అయితే ఆ పని పూర్తయ్యేంతవరకు వాటివంక చూడకూడదని రాజుకు ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ విగ్రహాలు చెక్కేటప్పుడు రాజుగానీ, ఇతరులు ఎవరైనాగానీ చూస్తే.. వారు తమ పనిని అర్థాంతరంగా ముగించేస్తామని హెచ్చరించారు. అందుకు ఇంద్రద్యుమ్నుడు ఒప్పుకుంటాడు. కొన్నాళ్లు ఇలాగే గడిచాక.. రాజు భార్య అయిన గుండిచాదేవి ప్రోద్బలంతో ఆ విగ్రహాలు ఎంతవరకు పూర్తయ్యాయోనని తెలుసుకోవడానికి ఇంద్రద్యుమ్నుడు విగ్రహాలు తయారుచేస్తున్న చోటుకు చేరుకుంటాడు.

అయితే ఆ శిల్పాలు కాస్త మాయమై, సగం మాత్రమే చెక్కి వున్నట్లు కనిపించాయి. దాంతో ఆ రాజు తాను చేసిన పొరపాటుకి బాధపడుతూ, కుంగిపోతాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు అతని ముందు ప్రత్యక్షమై, అతడిని ఓదార్చి, వాటిని అలాగే ప్రతిష్టింపజేశారు. నాటినుంచి అవి అలాగే పూజలు అందుకుంటున్నాయి. అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు. జగన్నాథ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా పురాణాలలో ప్రచురించబడి వుంది. అందులో జగన్నాథుడు సవరల దేవుడనీ.. నీలమ్దవుడు అనే పేరుతో గిరిజనుల నుంచి పూజలు అందుకునేవాడని
స్థలపురాణం చెబుతోంది.

ఆలయ చరిత్ర :
12వ శతాబ్దంలో అప్పటి కళింగరాజు అయిన అనంత వర్మన్ చోడరంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకారులు ఇక్కడ లభించిన కొన్ని శాసనాలు, ఆధారాల ద్వారా వెల్లడించారు. అయితే అతని మరణం తరువాత ఈ ఆలయం ఆఫ్గన్ల దండయాత్రల్లో ధ్వంసం కావడంతో ఆయన మనవడు అయిన అనంగ భీమదేవుడు తిరిగి దీనిని పునర్మించి, విగ్రహాలను పున:ప్రతిష్టించాడని వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఆలయం ఆకారం కూడా ఆయన కాలందేనని వారు పేర్కొంటున్నారు.

జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.
ఈ యాత్రకు సంబంధించిన సన్నాహాలను 60రోజుల ముందునుంచే అంటే బహుళ విదియనాటి నుంచే ఇక్కడి పూజారులు ప్రారంభిస్తారు.




పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Friday, 16 December 2016

ఇడ్లీ


ఇడ్లీ

కావలిసిన  పదార్థాలు
1.  మినపప్పు  1 గ్లాసు
2. ఉప్పుడు  నూక  2 గ్లాసులు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. నెయ్యి  1 స్పూన్

తయారీ  విధానం
ముందుగా  మినపప్పును  ,వుప్పుడునూక ను  ,
విడివిడిగా  వేరు  వేరు  గిన్నెలలో,
 నీళ్ళుపోసి  6 గంటల పాటు  నానబెట్టుకోవాలి .
నానిన  పప్పును నూకను  శుభ్రం  గా కడుగుకోవాలి  .
పప్పును తగినంత  ఉప్పు  వేసి  ,మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి  .
 రుబ్బిన  పిండిలో  నూకను  వేసి  ,బాగా  కలిపి  3. గంటలసేపు  నాననివ్వాలి .
 ఇడ్లీ  ఫ్లేట్ లకు  నెయ్యి  వేసి  ,
నానిన పిండిని  గుంటలలో  వేసి,
ఇడ్లీ  కుక్కరుగాని  మాములు కుక్కరులోగాని  పెట్టి  ,
వుడికుంచుకుంటే
" ఇడ్లీ "  రెడీ  అవుతుంది 
వీటిని  కొబ్బరి పచ్చడి కారప్పొడి  ,సాంబారు  తో గాని  తింటే  బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

బర్బాటీ బంగాళాదుంప కూర


బర్బాటీ  బంగాళాదుంప  కూర

కావలిసిన  పదార్థాలు
1. బర్బాటీలు  100. గ్రాములు
2. బంగాళాదుంపలు  4.
3. అల్లం  చిన్న ముక్క
4. పచ్చిమిర్చి  4.
5.  కరివేపాకు  కొద్దిగా
6. కొత్తిమీర
7.  పసుపు  కొద్దిగా
8. ఉప్పు  రుచికి  సరిపడా
9. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
 సెనగపప్పు  1 స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్ , ఎండుమిరపకాయలు  2. ,ఆయిల్  3 స్పూన్స్.

తయారీ విధానం
 ముందుగా  బర్బాటీలు  ,బంగాళాదుంపలను  శుభ్రంగా  కడిగి ,
 చిన్నముక్కలుగా  తరిగి ,తగినన్ని  నీళ్లు  పోసి  ,కుక్కరులోపెట్టి  ఉడికించుకుని,
 చల్లార్చుకోవాలి . అల్లం  ,పచ్చిమిర్చిని  మెత్తని  పేస్ట్  లాగ  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,వేడెక్కాక  ఆయిల్ వేసి,
 పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి,  దోరగా  వేగాక  ,
కరివేపాకు  ,అల్లం ,పచ్చిమిర్చి  పేస్టను  వేసి   ,
దోరగా  వేగాక  ,ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న
బర్బాటీ  ,బంగాళాదుంప  ముక్కలు , పసుపు  ,తగినంత  ఉప్పు  వేసి  ,
బాగా కలిపి  కొద్దిసేపు  మగ్గనిచ్చి  ,స్టవ్  ఆఫ్  చేసుకుని
ఒక  బౌల్ లోకి  కూరను  తీసుకుని
పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే,
 బర్బాటీ  బంగాళా దుంప  కూర  రెడీ అవుతుంది.
ఈ కూర  అన్నం లోను  చపాతీలలోను బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

తోట కూర కందిపప్పు


తోటకూర  కందిపప్పు

కావలిసిన  పదార్థాలు
1. తోటకూర  3 కట్టలు
2.  కంది పప్పు  1 కప్పు
3. పసుపు  కొద్దిగా
4. ఉప్పు రుచికి  సరిపడా
5. పచ్చిమిర్చి  2.
6. వెల్లుల్లి  రెబ్బలు  3
7. నీళ్లు  తగినన్ని

పోపు దినుసులు
మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర  అర స్పూన్ , ఇంగువ  కొద్దిగా  ,
ఎండుమిరపకాయలు  2  ,ఆయిల్  3 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా   తోటకూరను  శుభ్రంగా  కడిగి,  సన్నగా  తరుగుకోవాలి.
 కందిపప్పును  శుభ్రం గా  కడుగుకోవాలి .
 ఒక  బాణలి లో  కందిపప్పును  వేసి , తగినన్ని  నీళ్లు  పోసి,
 ఉడికించుకోవాలి  .పప్పు  కొద్దిగా  ఉడికిన  తరువాత ,
తోటకూరను  కూడా   వేసి  ,బాగా  ఉడికిన తరువాత  ,
చిల్లులపళ్లెము లోవేసి  చల్లార్చుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి ,
 పైన  చెప్పిన  పోపు  దినుసులు  ,వెల్లుల్లి  రెబ్బలు  వేసి ,
 అవి  దోరగా  వేగాక  పచ్చిమిర్చి  చీలికలు  ,ఉడికించుకున్న  పప్పు  తోటకూరను  ,
పసుపు  వేసి  ,బాగా  కలిపి,  కొద్దిసేపు  మగ్గనిచ్చి  ,
తగినంత  ఉప్పును వేసి,  బాగా  కలిపి  ,
పొడిగా  అయ్యేంత  వరకు  ఉంచి
 స్టవ్  ఆఫ్  చేసుకుంటే
తోట కూర  కందిపప్పు రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi


Thursday, 15 December 2016

వంకాయ వేపుడు


వంకాయ  వేపుడు

కావలిసిన  పదార్థాలు
1. వంకాయలు  పావుకేజీ
2.  పసుపు  కొద్దిగా
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. కూర కారం  తగినంత
5. సెనగ పిండి  2 స్పూన్స్
6. ఆయిల్  6 స్పూన్స్

తయారీ  విధానం
కూర కారానికి
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర  స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ , ధనియాలు 1 స్పూన్
 ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా
విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి .
వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ
గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి .


వంకాయలను  శుభ్రం  గా  కడిగి
ఒక మోస్తరు  ముక్కలు గా  తరుగుకోవాలి.
స్టవ్  వెలిగించి.  వెడల్పయిన  బాణలి  పెట్టి  ఆయిల్  వేసి
వంకాయ ముక్కలు  ,పసుపు   ,వేసి  బాగా  వేగనివ్వాలి
మధ్య  మధ్య లో   అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి .
ఆయిల్  కూడా  వేస్తూ  ఉండాలి .
బాగా  వేగిన  తరువాత  సెనగ  పిండిని   వేసి  బాగా  కలిపి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి  , తగినంత  ఉప్పు  , కూర కారం  వేసి ,
 బాగా  కలిపి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 వంకాయ  వేపుడు  రెడీ  అవుతుంది
ఈ  వేపుడు  వేడి  అన్నంలోను  బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

ఆరోగ్యానికి " మిరియాలు చారు "


ఆరోగ్యానికి " మిరియాలు చారు "

మిరియాలలో ఆరోగ్య ప్రయోజనాలు
1. మిరియంలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.
2. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది.
3. మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.
4. మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, లక్షణాలు ఉన్నాయి.
5. మిరియాలు దగ్గు చికిత్సలోనే కాక క్యాన్సర్ ,మరియు ప్రేగు సమస్యల వంటి ఇతర వ్యాధుల నయంలో కూడా సహాయపడుతుంది.
6. రోజువారీ ఆహారంలో మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది

కావలిసిన  పదార్థాలు

1. పచ్చిమిర్చి  2
2. చింత పండు కొద్దిగా
3. బెల్లం  తగినంత
4. పసుపు  కొద్దిగా
5. ఉప్పు  రుచికి సరిపడా
6. కొత్తిమీర  కొద్దిగా
7. కరివేపాకు  కొద్దిగా
8. నీళ్లు  4 గ్లాసులు
9. మిరియాలు 4

పోపు  దినుసులు
ఆవాలు  కొద్దిగా  ,మెంతులు  కొద్దిగా   ,జీలకర్ర  కొద్దిగా,  ఇంగువ  కొద్దిగా  ,
ఎండుమిరపకాయ 1 ,  ఆయిల్  1 స్పూన్,

తయారీ  విధానం.
మిరియాలను  మెత్తని  పొడిలాగా  చేసుకోవాలి
ముందుగా  ఒక  గిన్నెలో  నీళ్లు  తీసుకుని ,
అందులో  చింత పండు   ,బెల్లం  ,ఉప్పు  ,పసుపు  ,మిరియాల  పొడిని
పచ్చిమిర్చి  ముక్కలు  ,వేసి  స్టవ్  మీద  పెట్టి  మరగ  నివ్వాలి  .
స్టవ్  పైన  బాణలి  పెట్టి ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి , వేగాక  కరివేపాకును  వేసి, వేగిన  తరువాత
మరుగుతున్న  రసం లో  వేసి  ఒక 5 నిమిషాల  తరువాత
స్టవ్  ఆఫ్  చేసుకుని , కొత్తిమీరను  చల్లి  మూత  పెట్టుకుంటే.
 " మిరియాలు చారు "రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

" శ్రీ కనక మహాలక్ష్మి" అమ్మవారు , విశాఖపట్నం


" శ్రీ కనక మహాలక్ష్మి"   అమ్మవారు , విశాఖపట్నం

బురుజుపేటలో వెలసిన " శ్రీ కనక మహాలక్ష్మి"  అమ్మవారిని భక్తులు
ఆరోగ్యాన్ని,  స్త్రీ లకు సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా ,
భక్తులు విశ్వసిస్తారు.

పూజలు చేసుకోడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి
పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి
దేవికి నివేదించే సంప్రదాయం ఉంది.
ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత.

అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు.
ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు అమ్మవారిని సందర్శించి ,
తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు.

శ్రీకనక మహాలక్ష్మి విగ్రహం ఇతర దేవాలయాలవలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని,
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పుగా పేర్కొంటారు. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అంచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరుతో పిలుస్తారు.

ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.

ప్రతి ఏటా మార్గశిర మాసం నెలరోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు.

ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా, ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు.

ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేదపండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Wednesday, 14 December 2016

బెండకాయ సెనగపిండి కారం కూర


బెండకాయ  సెనగపిండి  కారం  కూర

కావలిసిన  పదార్థాలు
 1. బెండకాయలు  పావుకేజీ
2.  సెనగ పిండి  3 స్పూన్స్
3.  కారం  2 స్పూన్స్
4. ఉప్పు  రుచికి సరిపడా
5. పసుపు  కొద్దిగా
6.  జీలకర్ర  1 స్పూన్
7. ఆయిల్  8. స్పూన్స్
8. కరివేపాకు

తయారీ  విధానం
ముందుగా  బెండకాయలను  శుభ్రం గా కడిగి  తుడిచి ఆరబెట్టుకోవాలి .
ఆరిన  బెండకాయలను  పైన  కింద   వున్న తొడిమలు  తీసి ,
బజ్జీపచ్చిమిరపకాయ లకు  ఎలా  గాట్లు  పెట్టుకుంటామో ఆలా గాట్లు  పెట్టుకోవాలి .
ఒక  ప్లేట్ లోకి  సెనగపిండి  ,కారం , తగినంత ఉప్పు  ,పసుపు  ,జీలకర్ర వేసి ,
బాగా కలిపి  3 స్పూన్స్  ఆయిల్  వేసి ,ముద్దలాగా  కలుపుకుని ,
గాట్లు  పెట్టుకున్న  బెండకాయలలో  కూరు కోవాలి .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక
4  స్పూన్స్  ఆయిల్ వేసి  ,కారం  కూరుకున్న  బెండకాయలను   ,
కరివేపాకును వేసి  ,అట్లకాడతో  కలిపి
మగ్గనివ్వాలి .మధ్య మధ్యలో  అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి .
బాగా  మగ్గిన  తరువాత  స్టవ్  ఆఫ్  చేసుకుని,
ఒక  బౌల్లోకి  తీసుకుంటే
బెండకాయ  సెనగపిండి కారం  కూర  రెడీ అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

గుంత పొంగణాలు


గుంత పొంగణాలు

కావలిసిన  పదార్థాలు
1. మినపప్పు  1 గ్లాసు
2. బియ్యం  2. గ్లాసులు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. జీలకర్ర 1స్పూన్
5. ఉల్లిపాయలు  2
6. పచ్చిమిర్చి  2
7. అల్లం చిన్న ముక్క
8.   కొత్తిమీర
9.  కేరట్లు  2
10. ఆయిల్  పావుకప్పు

తయారీవిధానం
ముందుగా  పొట్టు లేని మినపప్పు ను  , బియ్యాన్ని
 ఒక  గిన్నెలో నీళ్లు పోసి  6 గంటలపాటు  నానబెట్టుకోవాలి  .
నానిన  పప్పును  ,బియ్యాన్ని శుభ్రంగా  కడిగి,
తగినంత  ఉప్పును  వేసి ,
తగినన్ని   నీళ్లు పోసి  , మెత్తగా   గ్రైండ్  చేసుకోవాలి .
ఉల్లి పాయలు ,కేరట్లు  ,అల్లం  ,పచ్చి మిర్చి  ,కొత్తిమీరలను ,
శుభ్రం గా  కడిగి  సన్నగా  తరుగుకోవాలి .
రుబ్బిన మినప పిండి  గరిట  జారులాగా ఉండేలాగా చూసుకోవాలి.
గుంత పొంగణాల పాన్  తీసుకుని ,    స్టవ్  వెలిగించి  ఈ పెనం  పెట్టి
వేడెక్కాక  ఆయిల్  రాసి ఒక గరిట పిండి  ఒక్కొక్క  గుంత  లో  వేసి
పైన  తరిగిపెట్టుకున్న  కూరముక్కలు  ,జీలకర్ర వేసి , ఒక స్పూన్   ఆయిల్  వేసి  ,
దోరగా వేగనిచ్చితరువాత , తిరగేసి,
రెండో పక్కకూడా  దోరగా వేగనిచ్చి
ఒక  ప్లేట్ లోకి  తీసుకుంటే
గుంత పొంగణాలు  రెడీ
వీటిని  అల్లం  పచ్చడితో గాని,   కొత్తిమీర  పచ్చడితోగా ని  తింటే  రుచిగా ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. 

బర్బాటీ ఉల్లి కారం కూర


బర్బాటీ  ఉల్లి కారం  కూర

కావలిసిన  పదార్థాలు
1.  బర్బాటీలు  పావుకేజీ
2. ఉల్లిపాయలు  2.
3. కరివేపాకు
4. పసుపు
5 .ఎండుమిరకాయలు  6
6. జీలకర్ర  అర  స్పూన్
7. ధనియాలు  1 స్పూన్
8. ఉప్పు  రుచికి  సరిపడా
9. నీళ్లు  తగినన్ని
పోపు  దినుసులు
 మినపప్పు  1 స్పూన్  , ఆవాలు  అర  స్పూన్  , ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా  బర్బాటీలను  శుభ్రంగా  కడిగి  ,
చిన్న ముక్కలుగా   తరుగుకుని  ,కుక్కరు లో పెట్టి  ,
ఉడికించి  చల్లార్చుకోవాలి  .
ఉల్లిపాయలను  చిన్న ముక్కలుగా  తరుగుకోవాలి  .
తరిగిన  ఉల్లిపాయలు  ,ఎండుమిరపకాయలు  ,జీలకర్ర,  ధనియాలు  ,
పసుపు , తగినంత  ఉప్పు  వేసి , మెత్తని  ముద్దలాగ  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి , దోరగా  వేగాక  ,
ఉల్లిపాయ ముద్దను, కరివేపాకును వేసి ,
 పచ్చివాసన  పోయేంత  వరకు  వేపుకుని ,
 ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న  ,
బర్బాటీ  ముక్కలను  వేసి  ,బాగా  కలిపి,  కొద్దిసేపు  మగ్గనిచ్చి  ,
స్టవ్ఆఫ్  చేసుకుంటే  ,
బర్బాటీ  ఉల్లికారంకూర  రెడీ  అవుతుంది
ఈకూర  అన్నం లోను  చపాతీ  లోను  దోశె  లలోను  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

హరిహర హిరణ్యగర్భ


" ఓం నమో నారాయణాయ "


" హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప
ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః"

."శ్రీ సత్యనారాయణ స్వామియే నమః"

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే 
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Tuesday, 13 December 2016

వాము ఆకు " బజ్జీ లు


" వాము ఆకు " బజ్జీ  లు 

కావలిసిన పదార్థాలు
1. వాము ఆకులు 
2. సెనగపిండి ఒక గ్లాసు
3. వరిపిండి పావు గ్లాసు
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5.  కారం ఒక స్పూన్
6. ఉప్పు రుచికి సరిపడా
7. వాము కొద్దిగా
8. ఆయిల్ బజ్జీలు వేగడానికి సరిపడినంత
9. నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడా

తయారీ విధానం 
ముందుగా వాము ఆకులు  శుభ్రంగా కడిగి, 
ఒక ప్లేట్ లో  ఆరబెట్టాలి 
ఒక బౌల్ లోకి సెనగపిండి ,వరిపిండి ,
వాము ,ఉప్పు ,కారం ,బేకింగ్ పౌడర్ వేసి
బాగా కలిపి ,  తరువాత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ,
ఈపిండి గరిట జారులా ఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకుని ఆరిన వాము ఆకులను ఒక్కొక్కటి గా 
సెనగ పిండి లో ముంచి ఆయిల్ లో వేసుకుని
దోరగా వేపుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వాముఆకు బజ్జీ  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:

Achanta Subhadevi

వంకాయ టమాటా ఉల్లిపాయ కూర


వంకాయ టమాటా  ఉల్లిపాయ  కూర

కావలిసిన  పదార్థాలు
1. వంకాయలు  పావుకేజీ
2. టమాటాలు  2.
3. ఉల్లిపాయలు  3.
4. ఆయిల్   6 స్పూన్స్
5. పసుపు  కొద్దిగా
6. ఉప్పు  రుచికి  సరిపడా
7. కారం  రుచికి  సరిపడా
8. కొత్తిమీర
9. నీళ్లు  కొద్దిగా
10. కరివేపాకు

పోపు  దినుసులు
సెనగపప్పు  1 స్పూన్  , మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్ , జీలకర్ర  అర స్పూన్

తయారీ  విధానం
ముందుగా  టొమాటాలు  ,ఉల్లిపాయలు , వంకాయలను  శుభ్రం గా  కడుగుకోవాలి  .
టొమాటోలను ,ఉల్లిపాయలను , సన్నగా  చిన్నముక్కలుగా ను   ,
వంకాయలను  గుత్తి గా ఉంచి చీలికలు చేయాలి .
స్టవ్   వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  2 స్పూన్స్  ఆయిల్  వేసి
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసిఅవి  దోరగా  వేగాక  ,
కరివేపాకు ,టమాటో  ,ఉల్లిపాయముక్కలు , పసుపు  ,ఉప్పు  ,కారము  ,
వేసి  బాగా  కలిపి  కొద్దిగా  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి.
మధ్య  మధ్యలో  కలుపుతూ  ఉండాలి  .
కూర  అంతా  బాగా  దగ్గర పడేంత  వరకు  మగ్గనివ్వాలి .
స్టవ్   పైన వేరే  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి
తరిగిపెట్టుకున్న  వంకాయ  గుట్టలను ,వేసి దోరగా  వేపుకోవాలి .
ఇలా  దోరగా  వేపుకున్న  వంకాయ గుత్తు లను,
టమాటో  ఉల్లిపాయ  మిశ్రమంలో  వేసి  బాగా  కలిపి
పైన కొత్తిమీర చల్లి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 వంకాయ  టమాటో  ఉల్లిపాయ  కూర  రెడీ  అవుతుంది
ఈ కూరను  వేడి అన్నం లోను  చపాతీలలోను  బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

సెనగకట్టు పులుసు


సెనగకట్టు  పులుసు

కావలిసిన  పదార్థాలు
1. సెనగపప్పు   4  స్పూన్స్
2. నీళ్లు  3. కప్పులు
3. ఉల్లిపాయ 1
4.  టమాటా  1
5. పచ్చిమిర్చి  2
6.  కరివేపాకు
7.  కొత్తిమీర
8.   పసుపు  కొద్దిగా
9.   బెల్లం  కొద్దిగా
10.  చింత పండు  కొద్దిగా
11.  ఉప్పు  రుచికి  సరిపడా

పోపు  దినుసులు
ఆవాలు  కొద్దిగా  ,జీలకర్ర  కొద్దిగా , మెంతులు  కొద్దిగా  ,ఇంగువ  కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 2  ,ఆయిల్  3 స్పూన్స్

తయారీ  విధానం
 ముందుగా  సెనగ పప్పును  3. కప్పుల  నీళ్లు  పోసి,
 కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని  చల్లార్చు  కోవాలి  .
చల్లారిన  తరువాత  పప్పును  నీళ్ళనుండి  వేరు  చేసి ,
మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకుని   ,వేరు  చేసుకున్న  పప్పు  నీళ్లలో  కలుపుకోవాలి .
ఉల్లిపాయలను  సన్నగాను , పచ్చిమిర్చిని  చీలికలుగా ను , తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి ,
 వేడెక్కాక  ఆయిల్  వేసి  పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి  దోరగా  వేగాక
కరివేపాకు , పచ్చిమిర్చి , ఉల్లిపాయముక్కలు  వేసి  ,
అవి కూడా  దోరగా  వేగాక ,  సెనగపప్పు  మిశ్రమాన్ని   వేసి  ,
బాగా  కలిపి   పసుపు  ,బెల్లం  ,ఉప్పు  ,చింతపండును   
వేసి  బాగా కలిపి
 కొద్దిసేపు  మరగనిచ్చి  స్టవ్  ఆఫ్  చేసుకుని
కొత్తిమీర చల్లి మూత  పెట్టుకుంటే
సెనగ  కట్టు  పులుసు  రెడీ  అవుతుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

సత్యనారాయణం దేవం


" ఓం నమో నారాయణాయ "


" సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః.  "


" శ్రీ సత్యనారాయణ స్వామియే నమః"

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Monday, 12 December 2016

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి //ఇదేనా ఆ మురళి మోహన మురళి


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

వంకాయ చిక్కుడు కాయ అల్లం పెట్టికూర


వంకాయ  చిక్కుడు కాయ  అల్లం  పెట్టికూర

కావలిసిన  పదార్థాలు
1. వంకాయలు  పావుకేజీ
2. చిక్కుడుకాయలు   100 గ్రాములు
3.  అల్లం  చిన్న  ముక్క
4. పచ్చిమిర్చి  4.
5. కొత్తిమీర  కరివేపాకు
6.  పసుపు  కొద్దిగా
7. ఉప్పు  రుచికి  సరిపడా
8. వరిపిండి  కొద్దిగా 
పోపు  దినుసులు
సెనగపప్పు 1. స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్  ,
జీలకర్ర  అర స్పూన్ , ఎండుమిరపకాయలు   2  ,ఆయిల్  3 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  వంకాయలను , చిక్కుడుకాయలను  శుభ్రం  గా  కడిగి,
వంకాయలను  చిన్న   ముక్కలుగాను  ,చిక్కుడుకాయలను  ఈనెలు తీసి ,
 రెండు ముక్కలుగా  తరుగుకోవాలి.
వీటిని తగినన్ని నీళ్లు పోసి కుక్కరు  పెట్టి , ఉడికించుకుని  చల్లార్చుకోవాలి  .
అల్లం ,పచ్చిమిర్చి  ,కొత్తిమీరలను  ,మెత్తని  ముద్ద లాగ  గ్రైండ్  చేసుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి అవి   దోరగా  వేగాక ,
అల్లం ,పచ్చిమిర్చి , కొత్తిమీర  ముద్దను  ,
కరివేపాకును వేసి  వేగాక  ,
ఉడికించి చల్లార బెట్టుకున్న  వంకాయ ,చిక్కుడుకాయ  ముక్కలను  ,
పసుపు  ,తగినంత  ఉప్పు  ,వరిపిండిని  వేసి  ,
బాగా  కలిపి  కూర  అంతా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్  చేసుకుంటే

వంకాయ  చిక్కుడుకాయ  అల్లం  పెట్టి  కూర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi