Sunday 2 October 2016

బీరకాయ పచ్చడి


బీరకాయ పచ్చడి

 కావలిసిన పదార్థాలు
1. బీరకాయ పైన వుండే తొక్కలు ఒక కప్పు
2. బీరకాయ ముక్కలు ఒక కప్పు
3. చింతపండు కొద్దిగా
4.   రుచికి సరిపడా ఉప్పు
5.  కొద్దిగా పసుపు

పోపు దినుసులు
సెనగపప్పు  2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఆవాలు అర స్పూన్, ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 6 ,పచ్చి మిర్చి 3 ,
కరివేపాకు కొద్దిగా ,ఆయిల్  3 స్పూన్స్

తయారీ విధానం
సాధారణంగా బీర కాయ కూర చేసుకునేటప్పుడు
పైన వున్నా తొక్కలను తీసి లోపల వున్న ముక్కలను
 మాత్రమే ఉపయోగించుకుంటాము .
కానీ ఈ తొక్కలకి కొన్ని బీరకాయ ముక్కలను కలిపి పచ్చడి చేసుకోవచ్చు.
ముందుగా బీరకాయ తొక్కలను సన్నగా తరుగుకోవాలి,
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక ఒకప్లేటు లోకి తీసుకుని బాచల్లార్చుకోవాలి .
మరల అదే బాణలి లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి,
 తరిగిపెట్టుకున్న బీరకాయ తొక్కును ముక్కలను ,
పసుపు ,చింత పండు లను వేసి
కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి
చల్లారనివ్వాలి .ముందుగా చల్లారిన పోపు దినుసులను ,ఉప్పు వేసుకుని
మెత్తగా పొడిలాగా చేసుకుని ,
తరువాత బీరకాయ తొక్కును చింత పండును వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకుని
ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీని పైన
మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు లతో పోపు పెట్టుకుంటే
బీరకాయ పచ్చడి రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi