Saturday 8 October 2016

బర్బాటీ కొబ్బరి కోరు కూర


                                                             బర్బాటీ కొబ్బరి కోరు కూర

కావలిసిన పదార్థాలు

1. బర్బాటీలు పావుకేజీ
2. కొబ్బరికోరు ఒక కప్పు
3.  పచ్చిమిర్చి 3
4. కరివేపాకు
5. కొత్తిమీర
6. ఉప్పు రుచికి సరిపడా
7. పసుపు కొద్దిగా

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్  , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 3 స్పూన్స్

తయారీవిధానం
ముందుగా బర్బాటీలను శుభ్రం గా కడుగి
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి .
తరిగిన బర్బాటీలను కుక్కరులో పెట్టి ఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లో పోసి చల్లార బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
 పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు,  పసుపు , కొబ్బరికోరులను ,
వేసి ఇవి కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న బర్బాటీలను వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి , ఉప్పు వేసి బాగా కలిపి
కొద్దిసేపు మగ్గనిచ్చి,  స్టవ్ ఆఫ్ చేసుకుని
కూర అంతా ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
బర్బాటీలు కొబ్బరి కోరు కూర రెడీ
ఈ కూరను అన్నం లోను చపాతీలలో కి బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi