Thursday, 6 October 2016

పొగిచిన సెనగలు



పొగిచిన సెనగలు
కావలిసిన పదార్థాలు
1. సెనగలు 3 గ్లాసులు
2. మినపప్పు 1 స్పూన్
3. ఆవాలు అర స్పూన్
4. జీలకర్ర అర స్పూన్
5. ఎండుమిరపకాయలు 2
6. కరివేపాకు
7. ఉప్పు రుచికి సరిపడా
8. పసుపు కొద్దిగా
9. ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందు రోజు రాత్రి సెనగలు నీళ్లలో నానబెట్టుకోవాలి .
నానిన సెనగలను మరునాడు శుభ్రంగా కడిగి
కుక్కరు లో పెట్టి ఉడికించి చల్లారబెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
కరివేపాకును వేసి దీనిని కూడా వేగనిచ్చి
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న సెనగలు ,
పసుపు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి
తరువాత ఉప్పును కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు
మమగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే పొగిచిన సెనగలు రెడీ 
వీటిని దసరా రోజులలో అమ్మవారికి నైవేద్యం గా పెడుతూవుంటారు 
అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ఇవి ఒకటి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

దసరా శుభాకాంక్షలు