Monday 3 October 2016

కంద వడలు


కంద వడలు

కావలిసిన పదార్థాలు
1. కంద పావుకేజీ
2. పెసరపప్పు 2 కప్పులు
3. పచ్చి మిర్చి 6
4. బియ్యం 2 స్పూన్స్
5. పసుపు
6. ఉప్పు రుచికి సరిపడా
7. ఆయిల్ పావు లీటరు
8. ఎండుమిరపకాయలు 6
9.   వరిపిండి  ఒక గ్లాసు
10.  కొద్దిగా జీలకర్ర కొద్దిగా
11. ఇంగువ కొద్దిగా

తయారీ విధానం

ఈ కంద వడ లను రెండు రకాలుగా చేసుకోవచ్చు
1 . పెసరపప్పు తో చేసుకోవచ్చు
2 . వరిపిండి  కలిపి చేసుకోవచ్చు.

కంద పెసరపప్పు వడలు తయారీకి ముందుగా పెసరపప్పు ,
బియ్యాన్ని కలిపి  3 గంటలు నానబెట్టుకోవాలి .
కంద ను పైన వున్నతొక్కను తీసి శుభ్రం గా కడిగి
సన్నగా చిన్నని ముక్కలుగా తరుగుకోవాలి.  ఈ కంద ముక్కలు నానబెట్టిన ,
పెసరపప్పులను కలిపి
పసుపు , ఉప్పు , పచ్చిమిర్చి లను వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకుని ,ఒక గిన్నె లోకి తీసుకుని
జీలకర్రను వేసి బాగాకలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి
ఆయిల్ వేడెక్కాక స్పూన్స్ తో ఈ పిండిని తీసుకుని
పునుకుల మాదిరి గా వేసుకునిదోరగా వేపుకుంటే
వేడి వేడి కంద పెసర పప్పు వడలు రెడీ.


కంద వడలు  వరిపిండితో  వీటి తయారీకి
ముందుగా కంద ను పైన వున్నతొక్కు తీసి శుభ్రం గా కడిగి సన్నని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
 తరిగిన కంద ముక్కలను ఉప్పు,  పసుపు , ఎండుమిరపకాయలు
ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని
ఒక బౌల్ లోకి తీసుకుని వరిపిండి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి .
ఈ పిండిని ఒక ప్లాస్టిక్ పేపర్ మీదగాని
లేక అరిటాకు మీద గాని వేసుకుని వడల మాదిరిగా తట్టుకుని
ఆయిల్ లో దోరగా వేపుకుంటే ఘుమ ఘుమ లాడే కంద వరిపిండి వడలు రెడీ
ఈ వడలు వేడి అన్నం లో, చాలా రుచిగా ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi