మెంతికూర చపాతి
కావలిసిన పదార్థాలు
1. మెంతికూర ఒక కప్పు
2. గోధుమపిండి 2 కప్పులు
3. పసుపు
4. ఉప్పుకొద్దిగా
5. కారం అర స్పూన్
6. ఆయిల్ చిన్న కప్పు
7. నీళ్లు పిండి కలపడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా మెంతికూరను శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న మెంతికూరను ,పసుపును వేసి
పచ్చివాసన పోయేంతవరకు మగ్గనివ్వాలి .
ఒక బౌల్ లో గోధుమ పిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి ,
కారం ,ముందుగా మగ్గబెట్టుకున్న మెంతికూరను వేసి
కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ,
పొడి లేకుండా చపాతీ పిండి మాదిరిగా కలిపుకోవాలి ,
కొద్దిగా ఆయిల్ ను పిండి మీద వేసి బాగా మర్ధించాలి
రెండు గంటల సేపు ఈ పిండిని బాగా నాననివ్వాలి
నానిన పిండిని చపాతీ మాదిరి గుండ్రం గా వత్తుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడిఎక్కాక వత్తుకున్న చపాతి
వేసి పచ్చిపోయేలా తిరగ వేసి
తరువాత ఆయిల్ వేసి చపాతీ మాదిరి కాల్చుకుంటే
వేడి వేడి మెంతి కూర పరోటాలు రెడీ.
కచంబర్ తో లేదా , బూందీ రైతా తో బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi