Tuesday 11 October 2016

ఆనపకాయ పెరుగుపచ్చడి


ఆనపకాయ పెరుగుపచ్చడి

కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయముక్కలు 2 కప్పులు
2  పచ్చిమిర్చి
3 కరివేపాకు
4. పసుపు
5. పెరుగు పావులీటరు
6. కొత్తిమీర

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అరస్పూన్
ఎండుమిరపకాయలు 2 ఉప్పు రుచికి సరిపడా ఆయిల్ 2 స్పూన్
తయారు విధానం
ముందుగా ఆనపకాయను శుభ్రంగా కడిగిచిన్న ముక్కలుగా తరుగుకుని
 కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార బెట్టుకోవాలి
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి
ఒక గిన్నె లోకి పెరుగు తీసుకుని , పసుపు , ఉప్పు
వేసి బాగా కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను  వేసి
దోరగా వేగాక , కరివేపాకు ను వేసి వేగనివ్వాలి
వేగిన ఈ పోపు దినుసులను , పచ్చిమిర్చి లను వేసి
బాగా కలుపుకుని
పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఆనాపకాయ పెరుగు పచ్చడి రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi