Sunday 9 October 2016

పచ్చి టమాటో మెంతిముక్కలు


పచ్చి టమాటో మెంతిముక్కలు

కావలిసిన పదార్థాలు
1. టొమాటోలు 6
2. ఎండుమిరపకాయలు 10
3. మెంతులు అరస్పూన్
4.  ఆవాలు అరస్పూన్
5. జీలకర్ర అరస్పూన్
6. మినపప్పు 1 స్పూన్
7. ఇంగువ కొద్దిగా
8. ఆయిల్ 6 స్పూన్స్
9. ఉప్పు రుచికి సరిపడ
10. పసుపు కొద్దిగా

తయారీ విధానం
ముందుగా  పచ్చి టొమాటోలను శుభ్రం గా కడిగి
ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తరువాత
సన్నగా చిన్నని ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని
చల్లార్చుకోవాలి చల్లారిన తరువాత
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి
 ఒక వెడల్పయిన ప్లేటులోకి
 తరిగిపెట్టుకున్న టొమాటోముక్కలు  ,
గ్రైండ్ చేసుకున్న కారం పొడి,
 సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి
పైన ఆయిల్ వేసి బాగా కలిపితే
పచ్చి టమాటో మెంతిముక్కలు రెడీ

ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi