Saturday, 8 October 2016

పచ్చి టమాటో ఆవ బద్దలు


పచ్చి టమాటో ఆవ బద్దలు
కావలిసిన పదార్థాలు

1. పచ్చి టొమాటోలు 8
2. ఎండుమిరపకాయలు 8
3. ఆవాలు 2 స్పూన్స్
4. ఇంగువ కొద్దిగా
5. జీలకర్ర కొద్దిగా
6. ఆయిల్ 3 స్పూన్స్
7. ఉప్పు రుచికి సరిపడా
8. నీళ్లు  కొద్దిగా

తయారీ విధానం
ముందుగా పచ్ఛి టొమాటోలను శుభ్రం గా కడిగి
ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తరువాత
సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
ఎండుమిరపకాయలు,  జీలకర్ర,  ఆవాలు , ఇంగువ ,
సరిపడా ఉప్పును వేసి
 కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
ఒక వెడల్పయిన ప్లేట్ లోకి
తరిగిపెట్టుకున్న టొమాటోముక్కలు ,
గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ముద్ద ,
పసుపు ,ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే
టొమాటో ఆవ ముక్కలు రెడీ
ఇవి ఒక 15 రోజులపాటు నిలువ ఉంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi