Saturday 8 October 2016

ఉల్లిపాయ పచ్చడి


ఉల్లిపాయ పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. ఉల్లిపాయలు 5
2. పచ్చిమిర్చి 2
3. ఎండుమిర్చి 3
4. కొత్తిమీర కొద్దిగా
5. చింతపండు కొద్దిగా
6. బెల్లం కొద్దిగా
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా
9. ఆవాలు కొద్దిగా
10. జీలకర్ర కొద్దిగా
11. కరివేపాకు
12. ఆయిల్ 1 స్పూన్

తయారీ విధానము
ముందుగా ఉల్లిపాయలను , పచ్చిమిర్చి ,
కొత్తిమీరలను శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి
ఇలా తరిగిపెట్టుకున్న వీటికి
సరిపడ ఉప్పు ,  పసుపు , బెల్లం , చింతపండు ,
ఎండుమిరపకాయలు వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
ఆవాలు ,జీలకర్ర , కరివేపాకులను వేసి
 దోరగా వేయించుకుని
 ఈ పచ్చడి మీద వేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ
ఈ పచ్చడి దోసె లలోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi