Wednesday 12 October 2016

పొట్లకాయ కొబ్బరి కోరు కూర



పొట్లకాయ కొబ్బరి కోరు  కూర

కావలిసిన పదార్థాలు
1.పొట్ల కాయ 1
3.కొబ్బరికోరు ఒక కప్పు
4.కరివేపాకు
5. పచ్చిమిర్చి 2
6. కొత్తిమీర
7. ఉప్పు

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్,  ఎండుమిరపకాయలు 2
ఆయిల్ 3 స్పూన్స్ ,

తయారీ విధానం
ముందుగా పొట్లకాయనుశుభ్రంగా కడిగి
గుండ్రని సన్నని ముక్కలుగా తరుగుకుని
ఉడికించి ,చిల్లుల పళ్ళెము లో వేసుకుని  చల్లారబెట్టుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి వేగాక
కరివేపాకు పచ్చిమిర్చిచీలికలను కొబ్బరి కోరులను వేసి
అవి కూడా దోరగా వేగాక ముందుగా ఉడికించి
చల్లార బెట్టుకున్న పొట్ల కాయ ముక్కలను వేసి
బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి న తరువాత
సరిపడా ఉప్పు వేసి బాగాకలిపి
కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటె
పొట్ల కాయ కొబ్బరికోరు కూర రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi