Saturday, 29 October 2016

వెజిటబుల్ పులావు


వెజిటబుల్ పులావు
కావలిసిన పదార్థాలు
1. మాములు బియ్యం,లేదా
    బాసుమతి బియ్యం  3 గ్లాసులు
2. బంగాళా దుంపలు 3
3. కేరట్లు 2
4. బీట్రూట్ 1
5. అల్లం చిన్నముక్క
6.  వెల్లుల్లి రెబ్బలు 6
7. పచ్చిమిర్చి 8
8. ఉల్లిపాయలు 4
9. పచ్చి బఠాణీలు అరకప్పు
10. బీన్స్ 5
11. కొత్తిమీర కొద్దిగా
12. పెరుగు పావులీటరు
13. పసుపు కొద్దిగా
14. కారం 1 స్పూన్
15. ఉప్పు
16. ఆయిల్ 8 స్పూన్స్
17. జీడిపప్పు పలుకు లు 10

మసాలా దినుసులు
ధనియాలు 1 స్పూన్ , ఏలకులు 3 , మిరియాలు  5 ,లవంగాలు 4 ,
గసగసాలు అర స్పూన్ , దాల్చిన చెక్క చిన్న ముక్క ,పులావ్ ఆకు లు 4

తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి ఒక గ్లాసుబియ్యానికి రెండుగ్లాసుల చొప్పున నీళ్లు పోసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి
పులావ్ ఆకును కూడా వేసి
కుక్కరులోగాని రైస్ కుక్కరులోగాని  గాని   ఉడికించుకోవాలి .
ఉడికిన అన్నాన్ని ఒకవెడల్పయిన ప్లేట్ లోవేసి
బాగా చల్లారనివ్వాలి .
అల్లమును  , ఉల్లిపాయలను చిన్నముక్కలుగా తరుగుకోవాలి .
పైన చెప్పిన మసాలా దినుసులను ,తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ,అల్లం ముక్కలు ,
పచ్చిమిర్చిలను  ,వెల్లుల్లిరెబ్బలను వేసి మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
పైన చెప్పిన కూరలను శుభ్రంగా కడిగి
చిన్న ముక్కలుగా తరిగి , సరిపడా నీళ్లు పోసి ఉడికించి చల్లార బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి
జీడిపప్పు పలుకులనుదోరగా వేపుకుని, ఒక ప్లేటులో తీసుకోవాలి .
మరల అదే బాణలి లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
కొద్దిగా పసుపు , కారం , ముందుగా మనం తయారుచేసి
పెట్టుకున్న మసాలా ముద్దను ,వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి .
అదే స్టవ్ పైన వేరే బాణలి పెట్టి వేడెక్కాక  , 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
ఉడికించి చల్లరబెట్టుకున్న కూర ముక్కలను వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి
దీంట్లో ముందుగా వేపుకుని పెట్టుకున్న మసాలా ముద్దను వేసి ,
కొద్దిసేపు మగ్గనిచ్చి ఈ మిశ్రమాన్ని ఉడికించి
చల్లారబెట్టుకున్న అన్నం లో వేసి ,సరిపడినంత ఉప్పును వేసి ,
బాగాకలిపి పైన ముందుగా వేపుకుని పెట్టుకున్న,
జీడిపప్పు పలుకులు వేసి , మొత్తం ఒకసారి  కలిపి ,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమలాడే " వెజిటబుల్ పులావు " రెడీ అవుతుంది.
పది నిమిషాలు అలాగే మూతపెట్టి ఉంచి
సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

ఆనియన్ రైతా తయారీ విధానం
బౌల్ లో పెరుగు తీసుకుని , దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు ,
పచ్చిమిర్చి చీలికలు ,కొత్తిమీర ,తగినంత ఉప్పు వేసి  కలిపితే
ఆనియన్ రైతా రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi