మినప దోశ
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు ఒక గ్లాసు
2. బియ్యం రెండున్నర గ్లాసులు
3. మెంతులు 2స్పూన్స్
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 4
తయారీ విధానం
ముందుగా మినపప్పు ,బియ్యము ,,
శుభ్రం గా కడిగి నీళ్లుపోసుకుని ,
మెంతులను వేసి,
4 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని ఉప్పు , పచ్చిమిర్చి,
వేసి మెత్తగా రుబ్బుకోవాలి .
పైన జీల కర్రను వేసి బాగా కలపాలి.
పిండి గరిట జారుగాఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం అంతా ఆయిల్
పరుచుకునేలా చేసి , పెనమును సగము కోసిన ఉల్లిపాయ తో తుడవాలి
అప్పుడు పెనము నాన్ స్టికీ గా మారుతుంది.
ఇప్పుడు
ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ని
పెనం మధ్యలో వేసి గుండ్రంగా తిప్పుతూ అంచుల దాకా రావాలి.
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
అట్లకాడతో తిరగేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
దోరగా వేగిన తరువాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే
మినప దోశ రెడీ
ఈ దోశ ను కొబ్బరిపచ్చడి తో , లేదా అల్లము పచ్చడితో తింటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi