Thursday 6 October 2016

కొబ్బరికాయ పెరుగు పచ్చడి



కొబ్బరికాయ పెరుగు పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. కొబ్బరి కోరు 3 కప్పులు
2. పచ్చిమిర్చి 4
3. కరివేపాకు కొద్దిగా
4. పెరుగు పావులీటరు
5. కొత్తిమీర

పోపుదినుసులు
సెనగపపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అరస్పూన్,  జీలకర్ర అరస్పూన్ , ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు
ఆయిల్ 2 స్పూన్స్,  ఉప్పు రుచికి సరిపడా

తయారీవిధానం
ముందుగా పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి,
 పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని , కొబ్బరికోరు ,పచ్చిమిర్చి చీలికలు ,
సరి పడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించిబాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపుదినిసులను వేసి అవి దోరగా వేగాక
కరివేపాకును కూడా వేసి అది కూడా వేగాక
వీటిని కొబ్బరికోరు , పెరుగు మిశ్రమం లోవేసి
బాగా కలిపి పైన కొత్తిమీర చల్లుకుంటె
ఘుమఘుమ లాడే  కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi