Friday 30 September 2016

మినపప్పు పచ్చడి


మినపప్పు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు 6 స్పూన్స్
2. ఆవాలు అరస్పూన్
3. జీలకర్ర అరస్పూన్
4. ఇంగువ కొద్దిగా
5. ఎండుమిరపకాయలు 6
6. బెల్లం కొద్దిగా
7. చింతపండు కొద్దిగా
8. పసుపు కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. కరివేపాకు ఒక కప్పు
12. నూని 2 స్పూన్స్
13. మెంతులు అర స్పూన్
తయారీ విధానం
చింతపండును కొద్దిగా నీళ్ళుపోసి నాన బెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన మినపప్పు మరియు,
పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
కరివేపాకును కూడా వేసి , వేపుకుని బాగా చల్లార నివ్వాలి
చల్లారిన తరువాత ఉప్పును వేసి
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకుని
తరువాత పసుపు ,ఉప్పు , నానబెట్టిన  చింతపండు ,
బెల్లం లను వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని
మెత్తని ముద్ద లాగ గ్రైండ్ చేసుకుంటే మినపప్పు పచ్చడి రెడీ
ఈ పచ్చడిని అన్నం లోకి ఇడ్లి  లోకి దోసెలలోను చాలా బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi