చింత కాయ పచ్చడి
1. చింతకాయలు లేతవి పావుకేజీ
2. పచ్చిమిర్చి 6
3. ఎండుమిరపకాయలు పావుకేజీ
4. మినపప్పు 2 స్పూన్స్
5. ఆవాలు 2 స్పూన్స్
6. మెంతులు 1 స్పూన్
7. జీలకర్ర 1 స్పూన్
8. ఇంగువ కొద్దిగా
9. పసుపు
10. ఉప్పు రుచికి సరిపడా
11. ఆయిల్ ఒక కప్పు
తయారీ విధానం
ముందు గా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక 2 స్పూన్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపుదినుసులను వేసి
దోరగా వేపుకుని చల్లారనివ్వాలి .
చల్లారిన పోపు ను మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి.
చింతకాయలను శుభ్రం గా కడిగి
తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి
తడి ఆరిన చింతకాయలు రెండుగా చీల్చి
మద్యలోవున్న గింజలను తీసి సన్నగా తరుగుకోవాలి
సన్నగా తరిగిన చింతకాయ ముక్కలు
పసుపు, ఉప్పు , పచ్చిమిర్చిలను ,
లను మెత్తగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి
తరువాత ముందుగా తయారుచేసిపెట్టుకున్న
కారంపొడిని కూడా వేసి
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఒక కప్పు నువ్వుల నూనె వేసి
కొద్దిగా ఇంగువ కూడా వేసి
కొద్దిసేపు వేడెక్కనిచ్చి
ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి
బాగా కలిపి
నూనె అంతా పచ్చడిలోకి ఇంకేలాగ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
చింత కాయ పచ్చడి రెడీ.
ఇది వేడి, వేడి అన్నం లో , ఉల్లిపాయతో తింటే బాగుంటుంది.
ఈ పచ్చడి ఒక నెల పాటు నిలువ ఉంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer :
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.