దోస ఆవకాయ
దోస ఆవకాయ
కావలసిన పదార్థాలు
1. దోస కాయలు 2
2. ఆయిల్ 3 కప్పులు
( నువ్వుల పప్పు నూనె ఐతే చాల బాగుంటుంది )
3. నిమ్మకాయలు 2
కారము మిక్స్ తయారీకి
కారము 2 కప్పులు ,
ఆవపొడి 2 కప్పులు ,
ఉప్పు 1/2 కప్పు
కారము 2 కప్పులు
తయారీ విధానం
ఆవపొడి తయారీకి
ఆవాలను ఎండ లో పెట్టి బాగా ఎండనిచ్చి
గ్రైండ్ చేసుకోవాలి
కారము ఆవపొడి సమానం గా తీసుకోవాలి
ఒక పెద్ద ప్లేటులో కారము 2 కప్పులు
ఆవపొడి 2 కప్పులు
ఉప్పు 1/2 కప్పు వేసి
*(ఈ మూడు కలిపిన గుండ కూడా దొరుకుతుంది )
అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి
కొలత కారము ఉప్పు ఆవ కలిపినా మిశ్రమం ఒక కప్పు తీసుకుంటే
కప్పున్నర ముక్కలు తీసుకోవాలి
పైన చెప్పిన కొలతలు ప్రకారం దోసకాయ ముక్కలు ,
కారం మిక్స్ తీసుకుని బాగా కలిసేలా కలుపుకుని
ఆయిల్ నిమ్మరసం వేసి
అంతా కలిసేలా కలుపుకుంటే
దోస ఆవకాయ రెడీ
ఇది ఒక 20 రోజుల పాటు నిలువ వుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi