Monday, 31 October 2016

శివపూజకు ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం


శివపూజకు ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు
అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.

గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు,
పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు,
అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి,
గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర,
జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు,
నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట,
తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ,
మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు,
ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి.
ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ
శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు.
ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.

అదేవిధంగా శివుని
 ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే
ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది.

చైత్రమాసంలో
శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ,
దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది.

వైశాఖమాసంలో
శివుని నేతితో అభిషేకిస్తూ
తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

 శివపూజకు సంబంధించినంత వరకు

వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పూవు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం
అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు.

శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది.
శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు,
శివునితో సమమయిన పరాక్రమంగలవారై
వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/