Tuesday 4 October 2016

రవ్వదోసె


రవ్వదోసె

కావలిసినపదార్థాలు
1. మైదాపిండి ఒక గ్లాసు
2. వరిపిండి రెండు గ్లాసులు
3. జీలకర్ర 1 స్పూన్
4. ఉప్పు రుచికి సరిపడా
5. కారం 1 స్పూన్
6. ఆయిల్ ఒక కప్పు
7. నీళ్లు
8. గోధుమనూక ( బొంబాయి రవ్వ ) 2 గరిటలు.
9. అర ముక్క ఉల్లిపాయ.

తయారీవిధానం

ముందుగా మైదాపిండి , వరిపిండి,  గోధుమనూక,
 కారం ,ఉప్పు ,జీలకర్ర,  లను ఒక గిన్నెలోకి వేసుకుని
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి .
ఈ పిండి మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా వుండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్  వేసి పెనం అంతా సగం తరిగిన ఉల్లిపాయ తో అంతా రాసి
తుడిచేయాలి. అప్పుడు పెనము నాన్ స్టికీ పాన్ గా మారుతుంది.
అప్పుడు దోసెలపిండిని వేసుకోవాలి.
ఈ పిండిని  పెనం చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి .
తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
ఒక వైపు వేగనిచ్చి
అట్లకాడ తో తిరగేసి
మరలా ఒక స్పూన్ ఆయిల్ వేసి
రెండో వైపుకూడా వేగనిచ్చి,
మడత పెట్టుకుంటె రవ్వదోసే రెడీ
దీనిని కొత్తిమీర పచ్చడి తో గాని మాగాయపచ్చడి తో గాని తింటే చాలాబాగుంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi