మిక్స్డ్ రాగి దోశ
కావలిసిన పదార్థాలు
1. రాగి పిండి 1 కప్పు
2. గోధుమ పిండి అర కప్పు
3. వరి పిండి అర కప్పు
4. గోధుమ నూక అర కప్పు
5. ఉప్పు రుచికి సరిపడా
6. కారము 1 స్పూన్
7. నీళ్లు జీలకర్ర 1 స్పూన్
8. పచ్చిమిర్చి 2
9. ఉల్లిపాయలు 2
10. ఆయిల్ అర కప్పు
కావలిసిన పదార్థాలు
ముందుగా పైన చెప్పిన రాగిపిండి, గోధుమపిండి , గోధుమనూక ,
వరిపిండి ,జీలకర్ర , కారం , ఉప్పు , లను ఒక గిన్నెలో వేసి
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా ,
రవ్వ దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి ,
ఉల్లిపాయలను పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ,ఒక స్పూన్ ఆయిల్ వేసి, గరిట తో
పిండిని రవ్వ దోశ పిండిమాదిరిగా చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి.
పైన తరిగి పెట్టుకున్న , ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలను వేసి
అట్లకాడతో అద్ది ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి ,
అట్లకాడతో తిరగేసి మరల ఆయిల్ వేసి దోశను
దోరగా ( క్రిస్పీ గా ) వేగనిచ్చి ప్లేట్ లోకి తీసుకుంటే
మిక్స్డ్ రాగి దోశ రెడీ అవుతుంది
ఈదోశను కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi