Sunday 9 October 2016

బీరకాయ పెసరపప్పు కూర


బీరకాయ పెసరపప్పు కూర

కావలిసిన పదార్థాలు
1. బీరకాయలు  పావుకేజీ
2. పెసరపప్పు ఒక కప్పు
3. కరివేపాకు
4. పచ్చిమిర్చి 2

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ , ఇంగువ కొద్దిగా ,
జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిరపకాయ లు 2 ,
పసుపు కొద్దిగా ,ఉప్పు రుచికి సరిపడా ,ఆయిల్ 3 స్పూన్స్

తయారీవిధానం
ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి పైన వున్న తొక్కను తీసి
చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
పెసర పప్పు ను కూడా శుభ్రం గా కడుగుకోవాలి .
ఒక బాణలి లో బీరకాయ ముక్కలు పెసర పప్పు ను వేసి
కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ముక్క పదునుగా ఉడికించుకుని
చిల్లుల పళ్లెం లో వేసి చల్లార్చుకోవాలి
 స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి
దోరగా వేగాక తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకులను వేసి,
 కొద్దిగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న
బీరకాయ ,పెసరపప్పు ,పసుపులను వేసి ,
కొద్దిసేపు మగ్గనిచ్చి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి
పొడిగా అయ్యేంతవరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని
కొత్తిమీర చల్లుకుంటె బీరకాయపెసరపప్పు కూర రెడీ.
దీనిని అన్నం లోకి చపాతీలోకి చాలాబాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadev