Monday, 31 October 2016

భగిని హస్త భోజనము


భగిని హస్త భోజనము
రాఖి పండుగ తరువాత, అంత వైభవంగా అన్నాచెల్లెళ్ళు జరుపుకునే  పండుగ " భగిని హస్త భోజనము". ఈ పండుగను దీపావళి అమావాస్య వెళ్ళిన రెండవ  రోజున అంటే  " కార్తీక శుద్ధ విదియ "  నాడు  జరుపుకుంటారు.
భగిని  అంటే సోదరి , హస్త  భోజనము  అంటే  వారు తయారు చేసిన వంట. ఈ రోజున  అన్నగారు
తన  సోదరి  ఇంటికి  వెళ్లి బొట్టు పెట్టించుకుని  ఆమె వండిన వంటకాలను తింటారు.  అలా చేస్తే అన్నదమ్ములకు మంచి జరుగుతుందని అంటారు.

పురాణ కధనం:
సంధ్యాదేవి, సూర్యభగవానుల సంతానము యముడు, యమున.  అత్త వారింట్లో ఉన్నయమున తన అన్నగారిని  ఒకసారి భోజనానికి రమ్మని పిలిచింది. చెల్లెలి  ఆహ్వానము ప్రకారము వస్తానని  కబురు పంపాడు. అన్నగారికి ఇష్ట మైన వంటలన్నీ సిద్ధం చేసింది. కాని,ఆయనకు ఆరోజు వీలు పడక కార్తీక శుద్ధ విదియ నాడు  వస్తానని కబురు పంపి ఆరోజున వెళ్ళాడు. ఆరోజున అన్నగారు రాగానే బొట్టు పెట్టి హారతి ఇచ్చి తాను చేసిన వంటలను ప్రేమతో  వడ్డించింది. అన్నగారు ప్రసన్నుడై ఏదయినా వరము కోరుకొమ్మని అంటే , ప్రతి  ఏడాది కార్తీక  శుద్ధ విదియ నాడు  తన ఇంటికి భోజనానికి రావాలని ,అలాగే ప్రతి సోదరుడు  తన సోదరి ఇంటికి వెళ్లి భోజనము చేస్తే  అతనికి మంచి జరగాలని  కోరినది .ఆయన వరము ఇచ్చాడు.అప్పటినుంచి దీపావళి  అమావాస్య  వెళ్ళిన  రెండవ  రోజునకార్తీక  శుద్ధ  విదియ నాడు   ఈ  పండగ  చేసుకోవడము ఆనవాయతీగా వస్తోంది .

శ్రీకృష్ణుడు
కూడా   నరకాసుర  సంహారము  అనంతరం  తన సోదరి సుభద్ర   ఇంటికి వెళ్లి ఆమెచేతితో  హారతి తీసుకున్నాడు .

అలాగే బలి చక్రవర్తి
కూడా కార్తీక శుద్ధ విదియ నాడు తన సోదరి ఇంటికి వెళ్లి ఆమెను ఆశీర్వదించాడు.
ఆరోజున సోదరీ సోదరులు కలుసుకోవడానికి  వీలు కాని వారు  చంద్రునికి పూజ చేసి తమసోదరుల క్షేమం కోరు కుంటారు . సోదరులు  లేనివారు ఆ రోజున  చంద్రుడిని  తమ సోదరుడిగా  భావించి పూజిస్తారు.

ఈ పండుగను ఉత్తర భారతీయులు భాయి దూజ్ అని, నేపాల్లో  భాయి టికా అని, బెంగాలీలు భాయి ఫాటా  అని, కర్ణాటక, తమిళనాడు లలో  యమ ద్వితీయ అని, మరాఠీ, గుజరాతి  , గోవా, కొంకణి  ప్రాంతాల  వాళ్ళు  భాయిబిజ్ అని అంటారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Writer: Meenu Sriram




శివపూజకు ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం


శివపూజకు ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు
అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.

గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు,
పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు,
అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి,
గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర,
జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు,
నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట,
తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ,
మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు,
ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి.
ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ
శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు.
ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.

అదేవిధంగా శివుని
 ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే
ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది.

చైత్రమాసంలో
శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ,
దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది.

వైశాఖమాసంలో
శివుని నేతితో అభిషేకిస్తూ
తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

 శివపూజకు సంబంధించినంత వరకు

వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పూవు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం
అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు.

శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది.
శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు,
శివునితో సమమయిన పరాక్రమంగలవారై
వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/







Sunday, 30 October 2016

మసాలా వడలు


మసాలా వడలు
కావలిసిన పదార్థాలు
1. సెనగ పప్పు  ఒక గ్లాసు
2. ఉప్పు ,
3.  పసుపు కొద్దిగా
4. పచ్చిమిర్చి 4
5. అల్లం చిన్న ముక్క
6.  వెల్లుల్లి రెబ్బలు 4
7. కొత్తిమీర
8. మిరియాలు 4
9. జీలకర్ర కొద్దిగా
10.' ధనియాలు
11. ఆయిల్ పావులీటరు

తయారీ విధానం
ముందుగా సెనగ పప్పును శుభ్రం గా కడిగి
 గిన్నెలో వేసి ,  నానేలా  నీళ్ళు పోసి
3 గంటల సేపు నానబెట్టుకోవాలి .
నానిన సెనగప్పును నీళ్లు వంపేసి
చిల్లు ల పళ్లెం లోవోడెయ్యాలి,
వోడేసిన  సెనగపప్పును సగం కచ్చా పచ్చాగా ను
మిగిలిన సెనగపప్పు ఉప్పు ,పచ్చిమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు ,
అల్లం ,ధనియాలు ,మిరియాలు ,కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ ముద్దలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న
 సెనగ పప్పు మిశ్రమాన్ని, జీలకర్రను ,వేసి బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ పోసి
ముందుగా తయారుచేసి పెట్టుకున్న పిండిని
చిన్న చిన్న వడలు గా చేతితోగాని
ప్లాస్టిక్ కాగితం మీద గాని తట్టి
ఆయిల్ వేసి దోరగా వేపుకుంటే

వేడి వేడీమసాలా వడలు రెడీ
వీటిని టొమాటో సాస్ తో తింటే బాగుంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



మిక్స్డ్ రాగి దోశ


మిక్స్డ్ రాగి దోశ
కావలిసిన పదార్థాలు
1. రాగి పిండి 1 కప్పు
2. గోధుమ పిండి అర కప్పు
3. వరి పిండి అర కప్పు
4. గోధుమ నూక అర కప్పు
5. ఉప్పు రుచికి సరిపడా
6. కారము 1 స్పూన్
7. నీళ్లు జీలకర్ర 1 స్పూన్
8. పచ్చిమిర్చి 2
9. ఉల్లిపాయలు 2
10. ఆయిల్ అర కప్పు

కావలిసిన పదార్థాలు
ముందుగా పైన చెప్పిన రాగిపిండి,  గోధుమపిండి , గోధుమనూక ,
వరిపిండి ,జీలకర్ర , కారం , ఉప్పు , లను ఒక గిన్నెలో వేసి
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా ,
రవ్వ దోశ  పిండి మాదిరిగా కలుపుకోవాలి.
ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి ,
ఉల్లిపాయలను పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ,ఒక స్పూన్ ఆయిల్ వేసి, గరిట తో
 పిండిని రవ్వ దోశ పిండిమాదిరిగా చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి.
పైన తరిగి పెట్టుకున్న ,  ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలను వేసి
అట్లకాడతో అద్ది ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి ,
అట్లకాడతో తిరగేసి మరల ఆయిల్ వేసి దోశను
దోరగా ( క్రిస్పీ గా ) వేగనిచ్చి  ప్లేట్ లోకి తీసుకుంటే
మిక్స్డ్ రాగి దోశ రెడీ అవుతుంది
ఈదోశను కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


Saturday, 29 October 2016

వెజిటబుల్ పులావు


వెజిటబుల్ పులావు
కావలిసిన పదార్థాలు
1. మాములు బియ్యం,లేదా
    బాసుమతి బియ్యం  3 గ్లాసులు
2. బంగాళా దుంపలు 3
3. కేరట్లు 2
4. బీట్రూట్ 1
5. అల్లం చిన్నముక్క
6.  వెల్లుల్లి రెబ్బలు 6
7. పచ్చిమిర్చి 8
8. ఉల్లిపాయలు 4
9. పచ్చి బఠాణీలు అరకప్పు
10. బీన్స్ 5
11. కొత్తిమీర కొద్దిగా
12. పెరుగు పావులీటరు
13. పసుపు కొద్దిగా
14. కారం 1 స్పూన్
15. ఉప్పు
16. ఆయిల్ 8 స్పూన్స్
17. జీడిపప్పు పలుకు లు 10

మసాలా దినుసులు
ధనియాలు 1 స్పూన్ , ఏలకులు 3 , మిరియాలు  5 ,లవంగాలు 4 ,
గసగసాలు అర స్పూన్ , దాల్చిన చెక్క చిన్న ముక్క ,పులావ్ ఆకు లు 4

తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి ఒక గ్లాసుబియ్యానికి రెండుగ్లాసుల చొప్పున నీళ్లు పోసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి
పులావ్ ఆకును కూడా వేసి
కుక్కరులోగాని రైస్ కుక్కరులోగాని  గాని   ఉడికించుకోవాలి .
ఉడికిన అన్నాన్ని ఒకవెడల్పయిన ప్లేట్ లోవేసి
బాగా చల్లారనివ్వాలి .
అల్లమును  , ఉల్లిపాయలను చిన్నముక్కలుగా తరుగుకోవాలి .
పైన చెప్పిన మసాలా దినుసులను ,తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ,అల్లం ముక్కలు ,
పచ్చిమిర్చిలను  ,వెల్లుల్లిరెబ్బలను వేసి మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
పైన చెప్పిన కూరలను శుభ్రంగా కడిగి
చిన్న ముక్కలుగా తరిగి , సరిపడా నీళ్లు పోసి ఉడికించి చల్లార బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి
జీడిపప్పు పలుకులనుదోరగా వేపుకుని, ఒక ప్లేటులో తీసుకోవాలి .
మరల అదే బాణలి లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
కొద్దిగా పసుపు , కారం , ముందుగా మనం తయారుచేసి
పెట్టుకున్న మసాలా ముద్దను ,వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి .
అదే స్టవ్ పైన వేరే బాణలి పెట్టి వేడెక్కాక  , 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
ఉడికించి చల్లరబెట్టుకున్న కూర ముక్కలను వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి
దీంట్లో ముందుగా వేపుకుని పెట్టుకున్న మసాలా ముద్దను వేసి ,
కొద్దిసేపు మగ్గనిచ్చి ఈ మిశ్రమాన్ని ఉడికించి
చల్లారబెట్టుకున్న అన్నం లో వేసి ,సరిపడినంత ఉప్పును వేసి ,
బాగాకలిపి పైన ముందుగా వేపుకుని పెట్టుకున్న,
జీడిపప్పు పలుకులు వేసి , మొత్తం ఒకసారి  కలిపి ,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమలాడే " వెజిటబుల్ పులావు " రెడీ అవుతుంది.
పది నిమిషాలు అలాగే మూతపెట్టి ఉంచి
సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

ఆనియన్ రైతా తయారీ విధానం
బౌల్ లో పెరుగు తీసుకుని , దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు ,
పచ్చిమిర్చి చీలికలు ,కొత్తిమీర ,తగినంత ఉప్పు వేసి  కలిపితే
ఆనియన్ రైతా రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi















సివంగి వంకాయ


సివంగి వంకాయ
కావలిసిన పదార్థాలు
1. వంకాయలు పావుకేజీ
2. చింతపండు రసం
3. నూపప్పు పొడి 2స్స్పూన్స్
4.  బెల్లం కొద్దిగా
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. ఉల్లిపాయలు 2
8. కొత్తిమీర కొద్దిగా
9. జీడిపప్పు పొడి
10. ఆయిల్ 5 స్పూన్స్

కూరకారానికి
 సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ ,ధనియాలు అర స్పూన్ , ఎండుమిరపకాయలు 4

పోపుకి
 ఆవాలు కొద్దిగా , జీలకర్ర కొద్దిగా , ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయ 1

తయారీ విధానము
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి గుత్తులుగా తరుగుకోవాలి
ఉల్లిపాయలను సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
చింత పండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ,
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక జీడిపప్పును దోరగా వేపుకుని
ఒక ప్లేటులోకి తీసుకోవాలి ,నూపప్పు ను కూడా దోరగా వేపుకుని ,
ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి
సెనగపప్పు ,మినపప్పు ,ఆవాలు , జీలకర్ర , ఎండుమిరపకాయలు ,
వేసి దోరగా వేపుకోవాలి .ఇలా వేపుకున్న జీడీ పప్పును ,నూపప్పును ,
పోపు దినుసులను వేటికవి , విడివిడిగా మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేగాక
వంకాయ గుత్తులను వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి .
ఇలా  ముందుగా  నీళ్లలో నానబెట్టుకున్న చింతపండునుండి తుక్కులను తీసివేసి
ఆ రసమును మగ్గిన వంకాయలమీద వేసుకోవాలి,
తరువాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు , కొద్దిగా బెల్లం వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి,
 ముందుగా పొడి చేసి పెట్టుకున్న నూపప్పు పొడి ,కూరకారము ,జీడిపప్పు పొడి వేసి,
అట్లకాడతో కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని

కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
సివంగి వంకాయ రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi







వేంకటేశ్వర వజ్ర కవచ స్త్రోత్తం


శ్రీ  వేంకటేశ్వర వజ్ర కవచ స్త్రోత్తం

నారాయణ పరబ్రహ్మ సర్వ కారణ కారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షో పురుషః వేంకటేశ శిరోవతు
ప్రానేశ ప్రాననిలయః ప్రాణం రక్షతుమే హరిః

ఆకశారాట్ సుతనాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమః పాయా ద్దేహం మే వెంకటేశ్వరహ
సర్వత్ర సర్వకార్యేషు మంగాంబ జాని రీశ్వరహ
పాలయేన్నామకం కర్మ సాఫల్యం నహ ప్రయచ్చతు

య ఏతత్ వజ్రకవచ మభేధ్యం వెంకటేశ్వరహ
సాయం ప్రాత హ పటేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Friday, 28 October 2016

రాగి దోశ


రాగి దోశ
కావలిసిన పదార్థాలు
1. రాగి పిండి 2 కప్పులు
2. కొబ్బరికోరు 1 కప్పు
3.  పెరుగు  లేక పాలు 1 కప్పు
4. ఉప్పు రుచికి సరిపడా
5. నీళ్లు
6.  ఆయిల్ అరకప్పు
7. జీలకర్ర 1 స్పూన్
8. కారం 1 స్పూన్

తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె లోకి రాగి పిండి, కొబ్బరికోరు ,పెరుగు ,ఉప్పు ,జీలకర్ర , కారం వేసి
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా కలుపుకుని
ఒక అరగంట సేపు పిండిని బాగా నాననివ్వాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి
పిండి ని రవ్వదోశ పిండి మాదిరిగా చుట్టూ పోసుకుంటూ మధ్య లోకి రావాలి .
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
అట్లకాడతో  తిరగేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
 ప్లేట్ లోకి తీసుకుంటే రాగి దోశ రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

ద్రాక్షారామం


ద్రాక్షారామం
తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం. పంచారామాల్లో ఒకటి

పురాణ కధలు
తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారు
అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం.
పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దాక్షారామం అయింది.
ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు.ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం,  శివుడు జగద పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని
 మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.

 ఈ క్షేత్రం గురించి.
పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద
 వ్యాసుని విగ్రహం చెక్కబడింది.
వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు.
మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది. ·
ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. · వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు. ·
ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది. ·
ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.

గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి.
దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.

ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది.

ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు. · ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. · అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో
గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. · 9-10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి.  వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.· భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి,
సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.









అపరాజితా స్తోత్రమ్


అపరాజితా స్తోత్రమ్
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ ||

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || ౨ ||

కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || ౩ ||

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || ౪ ||

అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః || ౫ ||

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౬ ||

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౭ ||
O
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౮ ||

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౯ ||

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౦ ||

యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౧ ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౨ ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౩ ||

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౪ ||

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౫ ||

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౬ ||

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౭ ||

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౮ ||

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౯ ||

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౦ ||

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౧ ||

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౨ ||

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౩ ||

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౪ ||

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౫ ||

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౬ ||

ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః || ౨౭ ||

చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౮ ||

Thursday, 27 October 2016

గోరుచిక్కుడు కాయ కొబ్బరికోరు కూర



గోరుచిక్కుడు కాయ కొబ్బరికోరు కూర
1. గోరుచిక్కుడుకాయలు  పావుకేజీ
2. కొబ్బరికోరు ఒక కప్పు
3. పచ్చిమిర్చి 4
4. కరివేపాకు
5.  కొత్తిమీర
6. ఉప్పు

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్,
ఎండు మిరపకాయలు 3 ,ఆయిల్ 3 స్పూన్స్, పసుపు

తయారీ విధానం
ముందుగా గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ,
చిన్న ముక్కలుగా తరుగుకుని,
 కుక్కరులో పెట్టి ఉడికించి చిల్లుపళ్ళేం లో పోసి చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి .
కొంచెం కొత్తిమీరను , 2 పచ్చిమిర్చిని కలిపి ,
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పున పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
కొత్తిమీర , పచ్చిమిర్చిముద్ద , కరివేపాకు , కొబ్బరికోరు , కొద్దిగా పసుపు ,
పచ్చిమిర్చి చీలికలు వేసి అవి కూడా దోరగా వేగాక
ఉడికించి చల్లారబెట్టుకున్న
గోరుచిక్కుడు ముక్కలను వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి ,ఉప్పు వేసి బాగా కలిపి
కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని
కూరను ఒక బౌల్ లోకి తీసుకుని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
గోరుచిక్కుడు కొబ్బరి కోరు కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





గుత్తివంకాయ కారం కూర


గుత్తి వంకాయ కారం కూర
కావలిసిన పదార్థాలు
1. గుత్తివంకాయలు చిన్నవి పావుకేజీ
2. ఉల్లిపాయలు 2
3. ఆయిల్ 6 స్పూన్స్
4. పసుపు కొద్దిగా

కూర కారమునకు కావలిసిన పదార్థాలు
 సెనగపప్పు 2 స్పూన్స్ , మినపప్పు 2 స్పూన్స్ , ఆవాలు 1 స్పూన్ ,
జీలకర్ర 1 స్పూన్ , ధనియాలు 2 స్పూన్స్ ,
ఎండుమిరపకాయలు 10 , ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
 స్పూన్ ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి
దోరగావేపుకుని చల్లార్చుకోవాలి.
చల్లారిన పోపును సరిపడినంత ఉప్పు వేసి ,
మెత్త ని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .
గుత్తి వంకాయలను శుభ్రం గా కడిగి గుత్తులు గా తరుగుకోవాలి
 ఉల్లి పాయలను సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టివేడెక్కాక  ,
ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి
అవి దోరగా వేగాక గ్రైండ్ చేసిన కారము  వేసి కలిపి
దీన్ని వంకాయ గుత్తుల లో కూరి
ఆ వంకాయలను మరియు మిగిలిన
కారం పొడిని , బాణలి లో వేసి
కొద్దిగా నీళ్లు పోసి
 ఉడకనివ్వాలి కూర అంతా బాగాదగ్గర పడ్డాక
స్టవ్ ఆఫ్ చేసుకుని , ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
గుత్తివంకాయ కారం కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

అన్నపూర్ణాస్తోత్రం


అన్నపూర్ణాస్తోత్రం
అన్నం పరబ్రహ్మ స్వరూపము.అన్నం సర్వ జీవనాధారము.
అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి.

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧ ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౨ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౪ ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౫ ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౬ ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౭ ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౮ ||

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౯ ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ |

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Wednesday, 26 October 2016

రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు


రాగి  పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు

1. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది.
2. చాలా అధ్యయనాలు గదుల్లో ఏదో ఒక వస్తువుని
    రాగితో చేయించి పెట్టుకోమని సూచిస్తున్నాయి.
3. రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగడం వల్ల
   జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది.
   అరుగుదల సక్రమంగా ఉంటుంది.
4. రాగి బిందెలో నీళ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి.
5.  రాగిలో ఉండే పలు రకాల పోషకాలు
     మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి.
     పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది.
     జ్ఞాపకశక్తీ, ఏకాగ్రత చాలా బాగుంటాయి.
6. ఇది యాంటీ ఏజింగ్‌ కారకం. ఇందులో
    యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
7. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో
    రాగి కీలకపాత్ర పోషిస్తుంది.
8. ఈ లోహంతో చేసిన బిందెలో నీళ్లు తాగడం వల్ల
    ఎముకలు దృఢపడతాయి.
9. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
10. కీళ్ల సంబంధ సమస్యలున్నవారు
     తాగితే ఉపశమనంగా ఉంటుంది.
11. రాగి పాత్రల్లో నీళ్లను క్రమం తప్పకుండా తాగితే
     రక్తపోటు అదుపులోకి వస్తుంది.
     గుండె పనితీరు మెరుగు పడుతుంది.
12. కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది.
13. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా
      రాగి బిందెలో నీళ్లు తీసుకుంటే ఎంతో మంచిది.
14. శరీరంలో రాగి లోపిస్తే… థైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి.
      దీన్ని అధిగమించాలంటే రాగి చెంబులో నీళ్లు తాగాలి.
15. థైరాయిడ్‌ గ్రంథులు కూడా ఉత్తేజితమై సమస్యలు రావు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/





మసాలా దోశ

మసాలా దోశ
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు ఒక గ్లాసు
2. బియ్యం రెండున్నర గ్లాసులు
3. మెంతలు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 4

కూర తయారీ కి కావలిసిన పదార్థాలు
1. బంగాళాదుంపలు పావుకేజీ
2. ఉల్లి పాయలు 4
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 3
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. కొత్తిమీర

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్,  మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 2 స్పూన్స్  , కరివేపాకు

దోశ పిండి తయారీ విధానం
ముందుగా మినపప్పు , బియ్యము ,  శుభ్రం గా కడిగి ,మెంతులు వేసి
నీళ్లుపోసుకుని 4 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని ఉప్పు పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి
పిండు గరిట జారుగాఉండేలా చూసుకోవాలి
 పైన జీల కర్రను వేసుకోవాలి.

కూర తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను శుభ్రం గా కడిగి,
 కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
 ఉల్లి పాయలను ,పచ్చిమిర్చిని , అల్లమును సన్నగా తరుగుకోవాలి .
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ,పచ్చిమిర్చి , అల్లము , కరివేపాకులను వేసి ,
ఇవి కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి
పసుపు ,సరిపడినంత ఉప్పులను ,వేసి,
 ముద్దా లాగ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి . ఈ కూరను ఒక బౌల్ లో కి తీసుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి
 పెనం అంతా ఆయిల్ పరుచుకునేలా చేసి , తరిగిన ఉల్లిపాయతో తుడిచి ,
ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ని
పెనం మధ్యలో వేసి గుండ్రం గా తిప్పుతూ అంచులవరకు రావాలి .
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
 అట్లకాడతో తిరగేసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగిన తరువాత ,
మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ,
బంగాళాదుంప కూరను పెట్టి,
సర్వ్ చేసుకుంటే
మసాలా దోశ రెడీ

ఈ దోశ  ను కొబ్బరిపచ్చడి తో గానకొత్తిమీర పచ్చడితో గాని తింటే రుచిగా ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Tuesday, 25 October 2016

ఆరోగ్యానికి " కొబ్బరి"

 ఆరోగ్యానికి " కొబ్బరి" 

1. పచ్చి కొబ్బరిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌,
   యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
3. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
5. నాలుగైదు ముక్కలు తింటే చాలు
    శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
6. ఎక్కువగా ఆటలాడే పిల్లలకూ దీన్ని పెట్టొచ్చు.
7. కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
8. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
9. చర్మానికీ మేలు జరుగుతుంది.
10. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి.
11. గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే మంచిది.
12. ఇందులో మేలు చేసే కొలెస్ట్రాల్‌ ఉంటుంది.
13. అది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
14. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి మంచిదే.
15. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు కొబ్బరి తినడం వల్ల
     ఆ సమస్య అదుపులో ఉంటుంది.
16. అలానే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లూ తగ్గుముఖం పడతాయి.
17. రాగి, సెలీనియం, ఇనుము, మాంగనీస్‌, ఫాస్పరస్‌,
     జింక్‌ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి.
18. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల జీవక్రియ రేటు సరిగా ఉంటుంది.
     ఎముకలూ, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
19. పచ్చికొబ్బరిలో బికాంప్లెక్స్‌ విటమిన్లు, ఫొలేట్లు,
     రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, థయామిన్‌ లభిస్తాయి.
20. తరచూ నోటిపూతతో బాధపడేవారు కొబ్బరి తిన్నా,
     కొబ్బరి పాలు తాగినా ఈ పోషకాలు అంది,
     ఆ సమస్య త్వరగా తగ్గుతుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


కార్యసిద్ధి ఆంజనేయ స్వామి శ్లోకాలు


ఆంజనేయ స్వామి శ్లోకాలు

భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Monday, 24 October 2016

పెరుగు


పెరుగు
1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని
ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి.
దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి.
దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి.
దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది.
మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి.
దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి,
ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి.
   తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి.
   ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి.
   ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే
శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.
ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి.
దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది.
ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత
విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది.
వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో
ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి.
ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది.
దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


మామిడికాయ పెసరపప్పు పచ్చడి

మామిడికాయ పెసరపప్పు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1.  పెసరపప్పు 2 కప్పులు
2.  మినపప్పు 2 స్పూన్స్
3. జీలకర్ర అర స్పూన్
4. ఎండుమిరపకాయలు 5
5. ఇంగువ కొద్దిగా
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడా
8. ఆవాలు అరస్పూన్
9. ఆయిల్ 2 స్పూన్స్
10. మామిడికాయ  1
11. కరివేపాకు
తయారీ విధానం
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ,
ఒక గిన్నెలో నానేలా నీళ్లుపోసుకుని 3 గంటలసేపు నానబెట్టుకోవాలి.
మామిడికాయను సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపుదినుసులను వేసి దొరగావేగనిచ్చి
చల్లార్చు కోవాలి .
పోపు చల్లారిన తరువాత
మెత్తని పొడి లాగ చేసుకోవాలి
దీంట్లో ముందుగా నానబెట్టుకున్న
పెసరపప్పుతరిగిపెట్టుకున్న, మామిడికాయముక్కలు
పసుపు సరిపడినంత ఉప్పు వేసి
కొద్దిగా నీళ్లుపోసుకుంటూ
మెత్తగా గ్రైండ్ చేసుకుంటేమామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ అవుతుంది
ఈ పచ్చడి పైన కొద్దిగా ఆవాలు ,జీలకర్ర ,
కరివేపాకు తో పోపు పెట్టుకుంటే,
మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

అన్నపూర్ణాతత్వము


అన్నపూర్ణాతత్వము

" అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం భిక్షామ్ దేహీచ పార్వతీ"

అన్నపూర్ణాదేవి కాశి క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని మనలను అందరిని అనుగ్రహిస్తూ ఉంటుంది.
ప్రత్యేకంగా అన్నపూర్ణోపాసన చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీవిద్యోపాసనలో అన్నపూర్ణాదేవిని అమృత శక్తిగా, అమృతేశ్వరీదేవిగా పూజిస్తారు.

అన్నపూర్ణ అనగానే మనకి గుర్తుకు వచ్చేటటువంటి మూర్తి ఎడమచేతిలో ,
మణిమాణిక్యాలతో పొదగపడిన బంగారు గిన్నెను పట్టుకుని, కుడిచేతిలో
బంగారు తెడ్డును మణిమకుటాలతో అలంకరింపబడింది పట్టుకుని
ఆ తల్లి మొదట పరమశివునికి అన్నం వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది.

అన్నపూర్ణ అనేటటువంటి నామము మహా మంత్రం. "అన్న" శబ్దానికి ఐశ్వర్యం అని కూడా అర్ధం.
ఏ ఇంట అన్నపూర్ణ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట దరిద్రం ఉండదు.

పూర్వకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.
ఈ దుర్గమాసురుడు బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు.
ఈ దుర్గముడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మఏమి వరం కావాలో కోరుకొ అన్నారు.
 వేదాలన్నీ నాలోకి వచ్చెయ్యాలి అని, ఇప్పటి వరకు వేదం చదువుకున్నవారు కూడా
దానిని మర్చిపోవాలి అని కోరుకున్నాడు.
వెంటనే బ్రహ్మగారు తధాస్తు అన్నారు.
ఎప్పుడైతే వేదాలన్నీ వాడిలోనికి వెళ్లిపోయాయో అందరూ కూడా వేదమంత్రాలు మర్చిపోయారు.
వేదమంత్రాలను మర్చిపోయేసరికి మరి భగవంతునికి హవిస్సు ఇవ్వడం లేదు.
భగవంతునికి హవిస్సు లేదు కాబట్టి వర్షాలు లేవు. వీటన్నింటికి కూడా అవినాభావ సంబంధం.
వర్షాలు లేక దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి.
ఎవరో కొంతమంది పెద్దలు వారికి తెలిసిన రీతిలో
అమ్మవారి ఆరాధన చేశారు. కొంతమంది కీర్తన ద్వారా, కొంతమంది ధ్యానం ద్వారా,
కొంతమంది నృత్యం ద్వారా తమ తమ భక్తిని ఆవిష్కరించారు.
అలా భక్తులందరూ పిలిచేసరికి ఆ కరుణామయి అయిన ఆమె
తన యొక్క చూపులతోనే అందరిని పోషించింది.
అందుకే ఆ తల్లిని శతాక్షి అన్నారు.
అందరికీ ఆకలిగా ఉంది. ఆ తల్లి తన శరీరం నుండే
అనేక రకాలైన కాయగూరలను,
పండ్లని సృష్టించి అనుగ్రహించింది "శాకంభరీ రూపం " లో
దుర్గమాసురుని సంహరించి 'దుర్గ' అనే నామాన్ని పొందింది.
వేదాలన్నింటిని తనలో నుంచి ప్రకాశింపచేసింది.
వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుపతికి దగ్గిరలో ఉంటుంది.
" శతాక్షి " , "విశాలాక్షి " ," శాకంబరీ " , " అన్నపూర్ణ " , అందరూ ఒక్కటే.



Sunday, 23 October 2016

పరోటాలు



పరోటాలు

కావలిసిన పదార్థాలు
1. మైదాపిండి పావుకేజీ
2. పెరుగు చిన్న కప్పు
3. ఉప్పు కొద్దిగా
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5. నీళ్లు కొద్దిగా
6. ఆయిల్ ఒక కప్పు

తయారీ విధానం
ముందుగా ఒక వెడల్పయిన బేసిన్ లోకి
మైదా పిండి , ఉప్పు , బేకింగ్ పొడి ,
పెరుగు , కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ
చపాతీ పిండి మాదిరి గా కలుపుకోవాలి .
ఈ పిండిని సుమారు 3 గంటలపాటు నాననివ్వాలి .
పిండి ఎంత బాగా నానితే పరోటాలు అంత మెత్తగా వస్తాయి .
పిండి బాగా నానిన తరువాత పిండిని తీసుకుని ,
 ఉండ చేసుకుని
చపాతీ మాదిరిగా గుండ్రంగా వత్తి ,
దీనిపై చాకుతో పావు భాగమును  కట్ చేసి ,
కొంచెం నుని రాసి, (పొరలు బాగా విడతాయి)
కోన్ మాదిరిగాచుట్టుకోవాలి. కొన్ ఎక్కువ రౌండ్స్ వచ్చేలా చూసుకోవాలి.
ఈ కోన్ ను  అర చేతిలో పెట్టుకుని ,
రెండో చేతితో పై బాగానే అదిమితే గుండ్రం గా తయారవుతుంది,
 దీనిని మరల వత్తుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
వత్తుకున్న పరోటాలను వేసి
చపాతీ మాదిరిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి
పరోటాలు అన్ని కాల్చుకున్నాక
అన్ని ఒక దాని మీద ఒకటి దొంతర లాగ పెట్టి
నాలుగు పక్కలాఒక్కసారి కుదిపితే
 ( అంటే రెండు చేతులు పెట్టి దగ్గరగా నెమ్మదిగా నొక్కాలి.)
అప్పుడు పొరలు విడివడతాయి.
కొంచెం జాగ్రత్తగా పొరలు విడితున్నాయా లేదా అని చూసుకుంటూ నొక్కితే
బాగా వస్తాయి. కనీసం నాలుగో  లేక ఐదో పరాటాలు దొంతర గా పెట్టాలి.
మొదట్లో కొంచెం కష్టమైనా , అలవాటు ఐతే బాగా వస్తాయి.
మన ఇంట్లో చేసుకుంటే శుభ్రత , నాణ్యత , సంతృప్తి బాగుంటాయి .
వీటిని ఏదయినా మసాలా కూరతో తింటే చాలా బాగుంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





చింత కాయ పచ్చడి

చింత కాయ పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. చింతకాయలు లేతవి పావుకేజీ
2. పచ్చిమిర్చి  6
3. ఎండుమిరపకాయలు పావుకేజీ
4.  మినపప్పు 2 స్పూన్స్
5. ఆవాలు 2 స్పూన్స్
6. మెంతులు 1 స్పూన్
7.  జీలకర్ర 1 స్పూన్
8. ఇంగువ కొద్దిగా
9. పసుపు
10. ఉప్పు రుచికి సరిపడా
11.  ఆయిల్ ఒక కప్పు

తయారీ విధానం
ముందు గా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక 2 స్పూన్ ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపుదినుసులను వేసి
దోరగా వేపుకుని చల్లారనివ్వాలి .
చల్లారిన పోపు ను మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి.
 చింతకాయలను శుభ్రం గా కడిగి
తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి
తడి ఆరిన చింతకాయలు రెండుగా చీల్చి
మద్యలోవున్న గింజలను తీసి సన్నగా తరుగుకోవాలి
సన్నగా తరిగిన చింతకాయ ముక్కలు
పసుపు,  ఉప్పు , పచ్చిమిర్చిలను ,
లను మెత్తగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి
తరువాత ముందుగా తయారుచేసిపెట్టుకున్న
 కారంపొడిని కూడా వేసి
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఒక కప్పు నువ్వుల నూనె వేసి
కొద్దిగా ఇంగువ కూడా వేసి
కొద్దిసేపు వేడెక్కనిచ్చి
ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి
 బాగా కలిపి
నూనె అంతా పచ్చడిలోకి ఇంకేలాగ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
చింత కాయ పచ్చడి రెడీ.
ఇది  వేడి, వేడి అన్నం లో , ఉల్లిపాయతో తింటే బాగుంటుంది.
ఈ పచ్చడి ఒక నెల పాటు నిలువ ఉంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer :
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.




స్పైసి ఉల్లి రవ్వదోసె



స్పైసి ఉల్లి రవ్వదోసె

కావలిసినపదార్థాలు
1. మైదాపిండి ఒక గ్లాసు
2. వరిపిండి రెండు గ్లాసులు
3. జీలకర్ర 1 స్పూన్
4. ఉప్పు రుచికి సరిపడా
5. కారం 1 స్పూన్
6. ఆయిల్ ఒక కప్పు
7. నీళ్లు
8. గోధుమనూక ( బొంబాయి రవ్వ ) 2 గరిటలు.
9.ఉల్లిపాయలు 
10. అల్లము 
11. కొత్తిమీర

కూర కారము కావలిసిన పదార్థములు
సెనగపప్పు 2 స్పూన్స్ , మినపప్పు 2 స్పూన్స్ ,ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1 స్పూన్
ధనియాలు 2 స్పూన్స్ ,ఎండుమిరపకాయలు 6 ,పసుపు కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా , ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి , పైన చెప్పిన పోపు దినుసులను వేసి
దోరగా వేపుకుని చల్లార్చు కోవాలి
చల్లారిన తరువాత ,ఉప్పు వేసి మెత్తని పొడి లాగ
గ్రైండ్ చేసుకుంటే కూర కారం రెడీ అవుతుంది.

దోశ తయారీవిధానం
ముందుగా మైదాపిండి , వరిపిండి,  గోధుమనూక,
 కారం ,ఉప్పు ,జీలకర్ర,  లను ఒక గిన్నెలోకి వేసుకుని
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి .
ఈ పిండి మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా వుండేలా చూసుకోవాలి .
ఉల్లిపాయలు , పచ్చి  మిరప కాయ లను 
సన్నగా చిన్న చిన్న ముక్కలు గా తరుగు కోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్  వేసి పెనం అంతా సగం తరిగిన ఉల్లిపాయ తో అంతా రాసి
తుడిచేయాలి. అప్పుడు పెనము నాన్ స్టికీ పాన్ గా మారుతుంది.
అప్పుడు దోసెలపిండిని వేసుకోవాలి.
ఈ పిండిని  పెనం చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి .
తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
ఒక వైపు కొంచెం వేగనిచ్చి.
అట్లకాడ తో తిరగేసి కూర కారము   కొద్దిగా చల్లి
 ఉల్లిపాయ ముక్కలు , జీలకర్ర ,అల్లము ముక్కలు ,
తరిగిన కొత్తిమీర ,పచ్చిమిర్చి ముక్కలు వేసి,మరలా ఒక స్పూన్ ఆయిల్  వేసి,
రెండో వైపుకూడా  దోరగా వేగనిచ్చి,
మడత పెట్టుకుంటె 
 స్పైసి ఉల్లి రవ్వదోశ  రెడీ
దీనిని , కొబ్బరి పచ్చడి తో ,సాంబారు తో  తింటే చాలాబాగుంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

అందాల అరకు లోయ


                                                             అందాల అరకు లోయ

మంచు తెరల సొగసులు
సంధ్యా రాగపు సరిగమలు
కర్పూర సుగంధాలు
గులాబీల గుబాళింపులు
ఉరికే  జలపాతాలు
పచ్చని  ప్రకృతి సౌందర్యాలు
కొండలు, కోనలు, లోయలు, గుహలు
మనసుకు అద్భుత ఆహ్లాదాన్ని పరిచయము చేసే సుందర రమణీయ ప్రదేశం,
ఆంధ్రా ఊటీ " అరకు ".
          ప్రశాంతమైన వాతావరణానికి, ఎన్నో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు, జలపాతాలు, వాగులు, కాఫీ పంటలు, గులాబి తోటలకు నెలవైన అరకు, విశాఖపట్నం నుండి సుమారు 115 కి. మీ. దూరంలో  వుంది. ఇక్కడికి రైలు లేదా రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. విశాఖ నుండి రైలు మార్గములో ప్రయాణము ఆహ్లాదకరముగా వుంటుంది. మార్గ మధ్య లో  ఇంచుమించు 46 సొరంగాల గుండా ప్రయాణము గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి గిరిజనుల చేసే ధింస మరియు మయూరి నృత్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అరకు, ఆ చుట్టుప్రక్కల తప్పక చూడవలసిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. వాటిలో  కొన్ని ప్రదేశాల వివరాలు మీ ముందుకు...
బొర్రా గుహలు
అరకు నుండి సుమారు 36 కి.మీ. దూరంలో బొర్రా గుహలు వున్నాయి. భారతదేశం లోనే అత్యంత లోతైన గుహలు అయిన బొర్రా గుహలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. సున్నపు రాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి. ఆ సహజ సిద్ధమైన  కళాకృతులు మనసును ఎంతో రంజింప చేస్తాయి.
గిరిజన మ్యూజియం
అరకులో తప్పక చూడవలసినది గిరిజన మ్యూజియం. ఇక్కడ నివసించే 19 రకాల తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతీ సాంప్రదాయాలు, జీవన శైలి గురించిన విషయాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ  మ్యూజియంలో పొందు పరిచారు.
చాప రాయి
అరకు నుండి సుమారు 15 కి.మీ. దూరంలో చాప రాయి ఉంది. చుట్టూ పచ్చటి అటవీ ప్రాంతం , మధ్యలో విశాలంగా పరచుకున్న రాతి పై జాలువారుతున్న జలపాతం, ప్రకృతి ప్రియులను కట్టి పడేస్తుంది. అరకులో ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఎన్నో సినిమా  షూటింగ్స్ కూడా  జరుగుతూ ఉంటాయి.
అనంతగిరి
అరకు నుండి సుమారు 26 కి.మీ. దూరంలో అనంతగిరి హిల్ స్టేషన్ ఉంది. అనంతగిరి కాఫీ పంటకు ప్రసిద్ధి. అనతగిరి మెయిన్ రోడ్ పై ఉన్న వ్యూ పాయింట్ నుంచి ఒక పక్క కొండలు, లోయలు మరో పక్క కాఫీ పంటలు ఎంతో అందంగా కనిపిస్తాయి .ఇక్కడ ఎన్నో జలపాతాలు ప్రకృతి ప్రియుల మనసు దోచుకుంటాయి.
కటికి జలపాతాలు
బొర్రా గుహలు నుండి సుమారు 7 కి.మీ. దూరంలో కటికి జలపాతాలు ఉన్నాయి. గోస్తాని నది నీటితో ఏర్పడిన ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంటాయి. జలపాతాల కింద ఉన్న కొలనులో స్నానం చెయ్యడం ఓ అద్భుతమైన అనుభూతి.
పద్మాపురం గార్డెన్
1942 లో రెండో  ప్రపంచ  యుద్ధ సైనికుల కోసం 26 ఎకరాలలో  కూరగాయలు పండించడానికి పద్మాపురం గార్డెన్ ఏర్పాటు చేసారు. తరవాత దానిని హార్టికల్చర్ నర్సరీ మరియు శిక్షణా కేంద్రంగా మార్చారు. అక్కడున్న ట్రీ హౌసెస్ ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఎన్నో రకాల పూల మొక్కలు కనువిందు చేస్తాయి.
అరకు జలపాతాలు
అరకు నుండి సుమారు 8 కి.మీ. దూరంలో ఉన్నాయి. 60 అడుగులు ఎత్తు నుండి పడుతున్న ఈ జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ జలపాతాలని చూడడానికి కొండ పైకి ఎక్కవలసి ఉంటుంది. వీటిని  చూడాలంటే అరకు-పాడేరు రోడ్డులో రెండు కి.మీ. వెళ్ళాక కుడి వైపు తిరిగి సుమారు 6 కి.మీ. వెళ్ళవలసి ఉంటుంది.
మత్స్య గుండం
అరకు నుండి సుమారు 35 కి.మీ. దూరంలో మత్స్య గుండం అనే కొలను ఉంది. మ్యచ్ కుండ్ అనే నది పై ఒక రాళ్ల సేతు ఉంది. అక్కడ నీటి ప్రవాహం ఒక పెద్ద గుండం లోకి వెళ్లి , అక్కడ నుండి 100 గజాల కింద బయటకు వస్తుంది. ఈ మత్స్య గుండం లో  ఎన్నో రకాల చేపలు ఉండుట ఓ ప్రత్యేకత. ఆ గుండంలోకి మెట్ల ద్వార దిగి చేపలకు ఆహరం పెట్టొచ్చు. నది ఒడ్డున శివాలయం ఉన్నది.
టైడ పార్క్
అరకు నుండి సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం పేరు  టైడ. ఈ ప్రాంతాన్ని జంగల్ బెల్స్ అని కూడా అంటారు. ఇక్కడ రాక్  క్లైమ్బింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, యారో షూటింగ్ మొదలైన ఆక్టివిటీస్ ఉంటాయి.
ఇవే కాకుండా  27 ఎకరాల్లో వున్న గులాబి తోట, దుంబ్రిగుడ జలపాతాలు, సుంగడ జలపాతాలు, దుడుమ జలపాతాలు, తాడిమాడ జలపాతాలు, పసుపు పచ్చగా ఎంతో ఆకర్షణీయంగా వుండే ఆవ పువ్వులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అందాలు ప్రకృతి ప్రియుల మనసు దోచుకుంటాయి. ఈ అందాలను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే అక్టోబర్ నెల నుండి మర్చి నెల మధ్యలో వెళ్ళాలి.

Friday, 21 October 2016

పెసరపప్పు పచ్చి పచ్చడి తో " దోశె "


పెసరపప్పు పచ్చి పచ్చడి తో  దోశె
కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు 2 కప్పులు
2. ఎండుమిరపకాయలు 4
3. జీలకర్ర కొద్దిగా
4. ఇంగువ కొద్దిగా
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. ఆయిల్  ఒక కప్పు
8. ఉల్లిపాయ  1
9. పచ్చిమిర్చి 2
10. కొత్తిమీర కొద్దిగా

తయారీ విధానం
ముందుగా పెసరపప్పు ను శుభ్రం గా కడిగి
నానేలా నీళ్లు పోసుకుని 3 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన పెసరపప్పును నీళ్లు ఒంపి చిల్లుల పళ్లెం లో వేసుకోవాలి.
పెసరపప్పు , ఉప్పు , పసుపు ,జీలకర్ర ,
ఇంగువ , ఎండుమిరపకాయలు , వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని
మెత్త గా గ్రైండ్ చేసుకోవాలి .
దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని గరిట జారుగా ఉండేలా చేసుకోవాలి.
ఉల్లిపాయలు , పచ్చిమిర్చి,  కొత్తిమీర ను ,
సన్నగా తరుగుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం  అంతా పామి
ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పచ్చడి మిశ్రమాన్ని వేసి
మినప దోశ మాదిరిగా మధ్యలోనుండిగుండ్రంగా తిప్పుకుని పైన
తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ,పచ్చిమిరపకాయముక్కలు ,
కొత్తిమీర ను వేసి కొద్దిగా ఆయిల్ ని కూడా వేసి వేగనిచ్చి
 అట్లకాడతో తిరగ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి
దోరగా వేపుకుంటే ,ఘుమ ఘుమ లాడే
పెసరపప్పు పచ్చి పచ్చడి దోశె రెడీ.
దీనిని వేడి అన్నం లో బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




పెసర పప్పు పచ్చి పచ్చడి





పెసర పప్పు పచ్చి పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు 2 కప్పులు
2. జీలకర్ర అరస్పూన్
3. ఇంగువ కొద్దిగా
4. ఎండుమిరపకాయలు 4
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. నిమ్మకాయ 1

పోపుకి
మినపప్పు అర స్పూన్ , జీలకర్ర కొద్దిగా , ఆవాలు కొద్దిగా ,
కరివేపాకు , ఆయిల్ 1 స్పూన్ ,

తయారీ విధానం
ముందుగా పెసరపప్పును శుభ్రం గా కడిగి
ఒక గిన్నెలో నానేలా నీళ్లు పోసి 3 గంటలసేపు నానబెట్టుకోవాలి
పెసరపప్పు నానిన తరువాత నీళ్లు వంపి చిల్లుల పళ్లెం లోవేసుకోవాలి
ఈ పెసరపప్పు , పసుపు , ఉప్పు , ఎండుమిరపకాయలు ,
జీలకర్ర , ఇంగువ , వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను ,కరివేపాకును వేసి,
దోరగా వేగిన తరువాత ముందుగా రెడీ చేసిపెట్టుకున్న
పచ్చడి మీద వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే
పెసర పప్పు పచ్చి పచ్చడి రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Thursday, 20 October 2016

మినప దోశ


మినప దోశ
కావలిసిన పదార్థాలు
1.  మినపప్పు ఒక గ్లాసు
2. బియ్యం రెండున్నర గ్లాసులు
3. మెంతులు  2స్పూన్స్
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 4

తయారీ విధానం
ముందుగా మినపప్పు ,బియ్యము ,,
శుభ్రం గా కడిగి నీళ్లుపోసుకుని ,
మెంతులను వేసి,
4 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని ఉప్పు , పచ్చిమిర్చి,
 వేసి మెత్తగా రుబ్బుకోవాలి .
పైన జీల కర్రను వేసి బాగా కలపాలి.
పిండి గరిట జారుగాఉండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం అంతా ఆయిల్
పరుచుకునేలా చేసి , పెనమును సగము కోసిన ఉల్లిపాయ తో తుడవాలి
అప్పుడు పెనము నాన్ స్టికీ గా మారుతుంది.
ఇప్పుడు
ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ని
పెనం మధ్యలో వేసి గుండ్రంగా తిప్పుతూ అంచుల దాకా రావాలి.
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
అట్లకాడతో తిరగేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
దోరగా వేగిన తరువాత  ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే
మినప దోశ రెడీ
ఈ దోశ  ను కొబ్బరిపచ్చడి తో , లేదా అల్లము పచ్చడితో  తింటే బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Wednesday, 19 October 2016

దొండ కాయ కారం కూర



దొండ కాయ కారం కూర
కావలిసిన పదార్థాలు
1. దొండకాయలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఉప్పు రుచికి సరిపడా
4. కరివేపాకు
5. ఆయిల్ 4 స్పూన్స్

కారమునకు కావలిసిన పోపు దినుసులు
సెనగపప్పు 2 స్పూన్స్ , మినపప్పు 2 స్పూన్స్,  ఆవాలు 1 స్పూన్,
 జీలకర్ర 1 స్పూన్ ,ధనియాలు 1 స్పూన్ , ఎండుమిరపకాయలు 6

తయారీ విధానం
ముందుగా దొండకాయలను శుభ్రం గా కడిగి
సన్నని నిలువు చీలికలుగా చేసుకోవాలి
వీటిని కుక్కరులో పెట్టి ఉడికించుకుని.
చిల్లుపళ్లెంలో వేసి చల్లార్చుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని చల్లార్చుకోవాలి.
చల్లారిన వీటిని పసుపు , సరిపడినంత ఉప్పు వేసి ,
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బానలిపెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న దొండకాయ చీలికలు
కరివేపాకులను వేసి దోరగా వేపుకోవాలి
మధ్య మధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి
ఇవి దోరగా వేగిన తరువాత
ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారంపొడి , ఒక స్పూన్ ఆయిల్ వేసి,
 బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
దొండకాయ కారంకూర రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi




Tuesday, 18 October 2016

పాలకూర పప్పు


పాలకూర పప్పు

కావలిసిన పదార్థాలు
1. పాలకూర 1 కట్ట
2. కందిపప్పు ఒక కప్పు
3.  పసుపు
4. పచ్చిమిర్చి 2
5. చింతపండు కొద్దిగా
6.  ఉప్పు రుచికి సరిపడా
7. కారం కొద్దిగా
8. కరివేపాకు
9. నీళ్లు తగినన్ని

పోపు దినుసులు
మినపప్పు అర స్పూన్ , ఆవాలు కొద్దిగా,  జీలకర్ర కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 2 ,ఇంగువ కొద్దిగా , వెల్లుల్లి రెబ్బలు 3
ఆయిల్ 2 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి,
 సన్నగా తరుగుకోవాలి .
కందిపప్పును కూడా శుభ్రం గా కడిగాలి .
ఇలా కడిగిన కందిపప్పును , పాలకూరను ,
తగినంత నీళ్లు పోసుకుని కుక్కరులో పెట్టి
ఉడికించుకోవాలి .
చింత పండును కొద్దిగా నీళ్లు పోసి ఒక కప్పులో నానబెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాకఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను , వెల్లుల్లి రెబ్బలను వేసి ,
అవి దోరగా వేగాక ,
కరివేపాకు , పచ్చిమిర్చిలను ముందుగా
ఉడికించి పెట్టుకున్న పాలకూర , పప్పులను ,
పసుపు సరిపడినంత ఉప్పు,  కారం , చింతపండు రసములను వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
 గరిట జారుగా వచ్చేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే పాలకూర పప్పు రెడీ
ఈ పప్పును అన్నం లోకి చపాతీ లోకి బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


ఆరోగ్యానికి, ఆరోగ్యము ... రుచికి ,రుచి... .పప్పుల దోశ



పప్పుల దోశ
కావలిసిన పదార్ధాలు

1. కందిపప్పు  1/4 కప్పు
2. పెసరపప్పు  1/4 కప్పు
3. శనగపప్పు   1/4 కప్పు
4. మినపప్పు  1/4 కప్పు
5. బియ్యం   3 కప్పులు
6. జీలకర్ర  1 స్పూన్
7. ఎండుమిరపకాయలు 3
8. ఉప్పు  రుచికి సరిపడా
9. నూనె

తయారి విధానం
నాలుగు రకాల పప్పులని, బియ్యాన్ని కడిగి,
బియ్యాన్ని వేరే పాత్రలో
పప్పులని వేరే పాత్రలో
4 లేదా  5 గంటల పాటు నానపెట్టుకోవాలి.
తరువాత నానిన బియ్యాన్ని , పప్పులని ,
ఎండుమిరపకాయల ముక్కలు , కలిపి రుబ్బుకోవాలి.
తరువాత  ఆ పిండిలో, జీలకర్ర ,ఉప్పు వేసి
కలుపుకోవాలి.ఈ పిండి మినప దోసె పిండి మాదిరిగా
గరిట జారుగా ఉండేలా చూసుకోవాలి
 స్టవ్ వెలిగించి, పెనం పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ నూనె వేసి
సగము తరిగిన ఉల్లిపాయ తో పెనము అంతా రాయాలి .
(అప్పుడు పెనము నాన్ స్టికీ గా మారుతుంది )
తరువాత పెనము మీద గరిట తో మద్య లో పిండి వేసి
 చక్రములా తిప్పుతూ అంచుల వరకు సర్దాలి.
ఒక స్పూన్ నూని  వేసి వేగనివ్వాలి.
తరువాత అట్టు తిరగేసి దోరగా వేగనిచ్చి ప్లేటు లోకి తీసుకుంటే
పప్పుల దోశ రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Monday, 17 October 2016

తోటకూర " కూర "


తోటకూర " కూర "

కావలిసిన పదార్థాలు
1.తోటకూర 5 కట్టలు
2.పచ్చిమిర్చి 4
3. అల్లం చిన్నముక్క
4. కరివేపాకు
5. పసుపు
6. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలుఅర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 3 ,
ఆయిల్ 3 స్పూన్ , వెల్లులిరెబ్బలు 6

తయారీ విధానం
ముందుగా తోటకూరను శుభ్రం చేసుకుని  బాగా కడిగి
సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగాను ,అల్లం సన్నగా తరుగుకోవాలి
సన్నగా తరిగిన తోటకూరను ,కొద్దిగా నీళ్లు పోసి
ఉడికించుకుని చిల్లుల పళ్లెంలో వేసి చల్లార్చుకోవాలి.
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను ,
వెల్లుల్లిరెబ్బలను వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చిని, అల్లంముక్కలను వేసి
ఇవి కూడా దోరగా వేగాక
ఉడికించి చల్లారబెట్టుకున్న తోటకూరను ,
పసుపును వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి
 సరిపడా ఉప్పును వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి
స్టవ్ ఆఫ్ చేసుకుంటె
తోటకూర " కూర " రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi


Saturday, 15 October 2016

స్పెషల్ రవ్వదోసె


స్పెషల్ రవ్వదోసె

కావలిసినపదార్థాలు
1. మైదాపిండి ఒక గ్లాసు
2. వరిపిండి రెండు గ్లాసులు
3. జీలకర్ర 1 స్పూన్
4. ఉప్పు రుచికి సరిపడా
5. కారం 1 స్పూన్
6. ఆయిల్ ఒక కప్పు
7. నీళ్లు
8. గోధుమనూక ( బొంబాయి రవ్వ ) 2 గరిటలు.
9. అర ముక్క ఉల్లిపాయ.
10. క్యారెట్ తురుము
11. కొత్తిమీర
12. పచ్చిమిర్చి ముక్కలు
13. కొబ్బరి తురుము
14. ఉల్లిపాయ ముక్కలు

తయారీవిధానం
ముందుగా మైదాపిండి , వరిపిండి,  గోధుమనూక,
 కారం ,ఉప్పు ,జీలకర్ర,  లను ఒక గిన్నెలోకి వేసుకుని
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి .
ఈ పిండి మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా వుండేలా చూసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్  వేసి పెనం అంతా సగం తరిగిన ఉల్లిపాయ తో అంతా రాసి
తుడిచేయాలి. అప్పుడు పెనము నాన్ స్టికీ పాన్ గా మారుతుంది.
అప్పుడు దోసెలపిండిని వేసుకోవాలి.
ఈ పిండిని  పెనం చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి .
తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
ఒక వైపు కొంచెం వేగనిచ్చి
అట్లకాడ తో తిరగేసి
మరలా ఒక స్పూన్ ఆయిల్ వేసి
క్యారెట్ తురుము ,కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలు ,
 పచ్చిమిర్చి ముక్కలు ,  కొబ్బరి తురుము వేసి
రెండో వైపుకూడా  దోరగా వేగనిచ్చి,
మడత పెట్టుకుంటె రవ్వదోసే రెడీ
దీనిని కొత్తిమీర పచ్చడి తో , కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలాబాగుంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

కేబేజీ కొబ్బరి కోరు కూర



కేబేజీ కొబ్బరి కోరు కూర

కావలిసిన పదార్థాలు
1. కేబేజీ పావుకేజీ
2. కొబ్బరి కోరు ఒక కప్పు
3. పచ్చిమిర్చి 4
5. కొత్తిమీర
6. కరివేపాకు
7. ఉప్పు రుచికి సరిపడా 

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిరపకాయలు 3 ,
ఆయిల్ 4 స్పూన్స్ ,

తయారీవిధానం
ముందుగా కేబేజీ ని శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
సన్నగా తరిగిన కేబేజీని ఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లో వేసి చల్లార్చగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి,
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
అవి దోరగా వేగాక తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,
కరివేపాకు ,కొబ్బరికోరులను వేసి ,
ఇవి కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న కేబేజీ ని కూడా వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి
సరిపడా ఉప్పును కూడా వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి
ఒక బౌల్ లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
 ఘుమఘుమ లాడే కేబేజీ కొబ్బరికోరు కూర రెడీ 
ఈ కూరఅన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము తెలుగు అనువాదము


                                          శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము తెలుగు అనువాదము

 కౌసల్యా కుమారా! పురుషోత్తమా ,రామా , తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన కర్తవ్యములు ఆచరింపవలసి ఉన్నది.
ఓ గోవిందా, గరుడ ధ్వజా, లక్ష్మీవల్లభా , లెమ్ము.
ముల్లోకములకును శుభములు కలిగింపుము.
జగన్మాతా , విష్ణు వక్షస్థలముననుండుదానా, కమలాయతాక్షీ,
ఆశ్రితుల కోరికలను నెరవేర్చు తల్లీ, వేంకటరమణుని రాణీ,
సరస్వతి, పార్వతి, శచీదేవి నిన్ను పూజించుచుందురు.
దయానిధీ , నీకు సుప్రభాతమగు గాక.
సప్తర్షులు నీ పాదములను పూజించుటకు సిద్ధముగానున్నారు.
ఓ వేంకటాచలపతీ ,శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు
మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ చరిత్రలను
కొనియాడుచున్నారు.
బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు.
లేత చిగురులు, పూల సువాసనలతో మలయమారుతము వీచుచున్నది.
పెంపుడు చిలుకలు విలాసముగా పాడుచున్నవి.
ఓ వేంకటేశ్వరా, నీకు సుప్రభాతము.
నారదుడు నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు.
ఓ శేషశైలాధీశా, నీకు సుప్రభాతమగు గాక.
తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించబూనుచున్నవి.
గొల్లపడుచులు పెరుగు చిలుకుచున్న సవ్వడులు నలుదిక్కుల నిండినవి.
శ్రీమాన్! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకబంధువుడవు.
శ్రీనివాసా! దయాసముద్రుడవు. లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడవు.
దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానముచేసి ద్వారము కడ కాచుకొనియున్నారు.
నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము,
వేంకటాద్రి, నారాయణాద్రి, వృషబాధ్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము
పిలుచుచుందురు.
అష్టదిక్పాలకులు నీ సేవకై కాచుకొనియున్నారు.
గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును తమ తమ శక్తిని చూపుటకు
నీ యనుమతిని వేడుచున్నారు.
ఓ వేంకటేశ్వరా! నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు.
ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు.
 స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని
కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయాగుణనిధివి.
లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు. అనంతుడు, గరుడుడు నీ పాదములను
సేవించుచుందురు.
నీవు పద్మనాభుడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు.
మాధవుడవు. జనులను రక్షించువాడవు. చక్రధారివి. శ్రీవత్స చిహ్నము కలవాడవు.
శరణాగతుల పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.
మన్మధుని తలదన్నే సుందరాకారా! కాంతాకుచపద్మముల చుట్టూ పరిభ్రమించే
చూపుగలవాడా. నీవు కీర్తిమంతుడవు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన,
పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి.
భక్తులు పరిమళభరితములైన పవిత్రగంగా జలమును బంగారు కలశముల
నింపి తెచ్చి నీ సేవకై యెదురు చూచుచున్నారు.
ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీవేంకటేశా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి.
పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను
కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సత్పురుషులు,
యోగులును నీ పూజకై మంగళ సామగ్రితో నీ సన్నిధికి వచ్చియున్నారు.
ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
శ్రీవల్లభా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు.
సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంత వేద్యుడవు.
భక్తులకు స్వాధీనుడవు. ఓ వేకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును
ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున
పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.

Friday, 14 October 2016

బంగాళ దుంపల వేపుడు


బంగాళ దుంపల వేపుడు

కావలసిన పదార్థాలు

1.   బంగాళ దుంపలు పావుకేజీ
2. ఆయిల్ 7 స్పూన్స్
3.  ఉప్పు  రుచికి సరిపడ
4. కారము రుచికి సరిపడ

తయారీ విధానము
ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి
 పైన వున్న తొక్క తీసి
చిన్న ముక్కలుగా కట్ చేసుకుని   95% ,
ఉడికింఛి చల్లారబెట్టుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
వేడెక్కాక ఉడికించి చల్లారబెట్టుకున్న
బంగాళదుంప ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి
మధ్య మధ్య లో  ఆయిల్ వేసి , అట్లకాడతో కలుపుతూ ఉండాలి
కాసేపు వేగనిచ్చిన తరువాత
సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి,
కారము  వేసి బాగాకలిపి
కొద్దిసేపు స్టవ్ మీద వుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
బంగాలదుంపల వేపుడు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi