Monday 2 May 2016

సోమేశ్వర దేవాలయము

                                                           సోమేశ్వర దేవాలయము
                                        భీమవరం - పశ్చిమ గోదావరి జిల్లా - ఆంధ్ర ప్రదేశ్

పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరంలో కల " భీమారామం ". పంచారామాలలో ఓకటి.  ఈ
ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడని చరిత్ర కారులు చెబుతారు.

ఇక్కడి లింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున
దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.

శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమముగా అమావాస్య వచ్చే సరికి గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది.

ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు.

ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి , అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది.

ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది..
 ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది.

అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది.

 అది దేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.