Sunday, 8 May 2016

తిరుమలలో పుణ్యతీర్థములు part 2


తిరుమలలో పుణ్యతీర్థములు part 2

1. స్వామి పుష్కరిణి :

స్వామి వారి ప్రధానాలయ సమీపంలో ఉండే ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని అంటారు. స్వామి వారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది.

2.ఆకాశ గంగ:
ప్రధానాలయం నుండి 5 కి.మీ. దూరం లో ఆకాశ గంగ తీర్థం ఉంది.
శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని విశ్వాసం .

3.పాప వినాశనం :
ప్రధానాలయం నుండి 3 మైళ్ళ దూరములో పాప వినాశనం తీర్థము వున్నది.

4.తుంబుర తీర్థం :
ప్రధానాలయం నుండి 16 కి.మీ. దూరం లో తుంబుర తీర్థం ఉన్నది.

5.పాండవ తీర్థం :
పాండవ తీర్థం తిరుమల కొండ ఆదిలో నృసింహ కొండ అభిముఖంగా ఉంది. ఈ తీర్థమునకు పౌరాణిక ప్రాశస్త్యం కలదు. వనవాస సమయములో ధర్మరాజు, అర్జునుడు ఇక్కడ స్నానం ఆచరించారని అంటారు. ఈ తీర్థానికి గో గర్భ తీర్థమని పేరు కూడా ఉన్నది .

6.కుమారధార తీర్థం:
మహా విష్ణువు యొక్క భక్తుడొకరు తిరుమలలో తపమునాచరించగా , ఆ శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై, అక్కడి తీర్థములో స్నానమాచరించమని చెప్తారు. అంతట ఆ భక్తుడు 16 ఏళ్ళ బాలుడిగా మారెను. అప్పటినుండి ఈ తీర్థమునకు కుమార తీర్థం అని పేరు వచ్చింది.
ఇక్కడికి చేరుకోవాలంటే అరణ్య మార్గం గుండా కొండలను అధిరోహించి వెళ్ళవలసి వుంటుంది.

7.చక్ర తీర్థం :
ప్రధానాలయం నుండి 2 కి.మీ. దూరంలో శిలాతోరణం ప్రాంగణంలో చక్ర తీర్థం వున్నది. సుదర్శన చక్రం పడిన ప్రాంతము కాబట్టి ఈ తీర్థమునకు చక్రతీర్థం అని పేరు వచ్చింది అని ఒక పురాణ కధనం.

వైకుంఠ తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 4 కి.మీ. దూరంలో వైకుంఠ తీర్థం వున్నది. రాముని వానరసేనలో వున్న వానరులకు ఇక్కడ వైకుంఠము కనిపించిందని, అందుకే వైకుంఠ తీర్థం అని పేరు వచ్చిందని అంటారు.

రామకృష్ణ తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 10 కి.మీ. దూరంలో రామకృష్ణ తీర్థం వున్నది.
ఈ తీర్థము వద్ద ఒక ముని తపస్సు చేసారని, వారి తపమునకు మెచ్చి శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై మునిని ఆశీర్వదించి, ఈ తీర్థమునకు చేరుకోవడానికి శేషాచల అడవుల
గుండా కొండలు అధిరోహించి వెళ్ళ వలసి వుంటుంది.

శేష తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 7 కి.మీ. దూరంలో శేష తీర్థం వున్నది. ఆదిశేషువు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని తన తోకతో చరచగా ఈ తీర్థం ఏర్పడిందని ఒక కధనం. 
ఇక్కడికి చేరుకోవడానికి అరణ్యం గుండా వెళ్ళవలసి వుంటుంది.

పసుపు తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 8 కి.మీ. దూరంలో పసుపు తీర్థం వున్నది.
ఈ పసుపు తీర్థం స్వర్గంలో వుండే పుణ్య తీర్థాలతో సమానము అని అంటారు.
ఈ తీర్థం తో స్వామివారికి ప్రత్యేకమైన అనుబంధము వుందని చెబుతారు. 
ఈ తీర్థమునకు చేరుకోవడానికి శేషాచల అడవుల గుండా కొండలు అధిరోహించి
వెళ్ళ వలసి వుంటుంది.

జపలి తీర్థం
ప్రధానాలయం నుండి సుమారు 7 కి.మీ. దూరంలో జపలి తీర్థం వున్నది. ఇక్కడ హనుమంతుని కోవెల వున్నది. జబలి అనే ఋషి ఇక్కడ పూజలు చేసారని, వారి వల్లనే ఈ తీర్థానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

సీతమ్మ తీర్థం
చక్ర తీర్థానికి శిలా తోరణానికి మధ్య సీతమ్మ తీర్థం వున్నది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/