Tuesday 10 May 2016

పంచారామ క్షేత్రాలు

                                                     
                                                             పంచారామ క్షేత్రాలు

1. అమరారామము (అమరావతి)

2. సోమారామము (భీమవరం)

3. క్షీరారామము (పాలకొల్లు)

4. ద్రాక్షారామము (తూర్పు గోదావరి జిల్లా)

5. కుమారామము (  సామర్లకోట )

1. అమరారామము :

గుంటూరుకు సుమారు 27కి .మీ. దూరంలో పావన కృష్ణానది తీరమున ఇంద్ర ప్రతిష్టగా నిలచిన “శ్రీ అమరేశ్వర స్వామి” పంచారామాల్లో  మొదటిది. ఇచ్చట స్వామివారితో పాటు  “దేవేరి రాజ్యలక్ష్మీ” అమ్మవారి దర్శనము చేయవచ్చు. ఈ క్షేత్రము పూర్వకాలము నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాముగా పేరుగాంచినది.

2. సోమారామము :

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్దగల గునుపూడిలో “శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి” దేవాలయం ఉంది. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో రెండవది. ఈ ఆలయము చంద్ర ప్రతిష్ట. గోధుమ , నలుపు వర్ణంలో గల సోమేశ్వర లింగము, పై  అంతస్తు లో “అమ్మవారు” ,  సోమేశ్వర లింగమునకు ప్రక్కన (కొంత దూరంలో)  “శ్రీ జనార్ధన స్వామి” వారు  వుంటారు.

3. క్షీరారామము :

పశ్చిమ గోదావరి జిల్లా లో గల పాలకొల్లులో “రామలింగేశ్వర లింగము” పంచారామాల్లో మూడవది. ఈ లింగము విష్ణు ప్రతిష్ట . స్వామి వారికి వెనుక భాగంలో మూడు చారులున్నాయి. ఇవి జటలని ప్రతీతి. ఈ లింగము తారకాసురుడు పూజించిన అమృత  లింగానికి శిరోభాగమని కొందరంటారు.

4. ద్రాక్షారామము :

తూర్పు గోదావరి జిల్లాలో గల ద్రాక్షారామము పంచారామాల్లో నాలుగవది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేసెను కాబట్టి , ఈ పవిత్ర స్ధలమునకు ద్రాక్షారామమని పేరు వచ్చింది. దక్షిణ కాశీగ ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామాములో భీమేశ్వరలింగము 15 అడుగులు  పైగా ఎత్తుంటుంది. పై అంతస్తు నుండి అభిషేకదులు చేస్తారు .
ఇచ్చట అష్టాదశ శక్తి పీఠముల్లో ఒకటి అయిన “మాణిక్యాంబా దేవి” దర్శనము చేయవచ్చు .

5. కుమారామము :

తూర్పు గోదావరి జిల్లా , పెద్దాపురం తాలూక సామర్లకోట , ఉన్న “కుమార భీమేశ్వరుడు” కూడా చాలా ఎత్తయిన లింగము. ఈ లింగము పంచారామాల్లో చివరది. ఈ లింగము కుమార స్వామి ప్రతిష్ట. స్వామి వారితో బాటు  “బాల త్రిపురసుందరి” దేవిని  కూడా  దర్శనము చేయవచ్చు.
.