Monday, 30 May 2016

నిమ్మకాయ ఉరగాయ


నిమ్మకాయ ఊరగాయ 
కావలిసిన పదార్థములు
1. నిమ్మ కాయలు 6
2. ఆవాలు  2 స్పూన్స్
3. మెంతులు  2 స్పూన్స్
4. నూని  గ్రాములు
5. ఇంగువ
6. కారము  2  కప్స్
7 ఉప్పు
   
తయారీ విధానము :
ముందుగా  స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి
మెంతులు  ఆవాలు నూనె లేకుండా పొడిగా  వేపుకుని
చల్లారాక మెత్తగా పోడిలా గ్రైండ్  చేసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
కొంచెము ఇంగువ  వేసుకుని  ఆయిల్ ని  వేడి చేసుకోవాలి
వేడి చేసుకున్న ఈ ఆయిల్ లో
పైన చెప్పిన కారము , మెత్తగా చేసిపెట్టుకున్న  మెంతి ఆవ పొడిని  ,
తగినంత ఉప్పుని వేసి
అంతా బాగా కలిసేలా చేసుకున్న తరువాత
తరిగి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను
వేసి కలుపుకుంటే
నిమ్మ కాయ ఊరగాయ రెడీ
Subha'skitchen