Thursday, 5 May 2016

ఉల్లి పాయ పులుసు "

           
                                     
                                                               "   ఉల్లి పాయ పులుసు "

కావలిసిన పదార్థాలు

1. ఉల్లి పాయలు  4
2. టమాటో 1
3. బెండకాయ లు 2
4. వంకాయ 1
5. పచ్చి మిరపకాయలు 2
6. కరివే పాకు
8.  వెల్లుల్లి 2 రెబ్బలు
9. ఆవాలు పావు స్పూన్
10. మెంతులు పావు  స్పూన్
11.  జీలకర్ర పావు స్పూన్
12.  ఎండు మిరపకాయలు 2
13. ఇంగువ కొద్దిగా
14.   చింత పండు నిమ్మ  కాయంత
15.  బెల్లము కొద్దిగా

తయారీ విధానము
చింత పండు ను ఒక గిన్నేలో  నీళ్ళూ పోసి నానబెట్టుకోవాలి ,
స్టవ్ వెలిగించుకుని  బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ,
పైన  చెప్పిన పోపు దినుసులను వేసి వేగాక,
ఉల్లి , టమాటో , వంకాయ  , బెండకాయ ముక్కలను ,
వెల్లుల్లి రెబ్బలను వేసి  దోరగా  వేగనివ్వాలి .
ఇప్పుడు నానబెట్టిన  చింతపండు ను ,
నానబెట్టిన  నీళ్ళలో  నుండి పిప్పిని తీసి వేసి ,
 వేగిన ఉల్లిపాయ మిశ్రమాని వేసి ,
పసుపు  , ఉప్పు,   బెల్లము సరిపడునంతగా  వేసి స్టవ్  మీద పెట్టాలి ,
ఒక 5 నిమిషాలు  మరిగాక,
ఒక 2స్పూన్స  వరి పిండిని  చిన్న కప్పులోకి తీసుకుని
నీళ్ళు పోసి ఉండలు లేకుండా  కలుపుకుని  ,
దానిని స్టవ్ మీద  మరుగుతున్న  పులుసులో
కలిపుకుని  కొంత సేపు  మరగనివ్వాలి ,
15 నిమిషాలు  మరిగాక స్టవ్  ఆఫ్  చేస్తే
ఉల్లిపాయ పులుసు రెడీ  .
దీనిని  ,
కందపొడి , కంది పచ్చడి  లేక పాటోలి తో తింటే బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi